సితార చిత్రంలో వంశీ గారి కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సితార (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ
ఓం...ఓం...
ఓంకార పంజర శుకీం.. ఓం..
ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం.. ఓం..
ఆగమ విపిన మయూరీం ఓం..
ఆర్యాం అంతర్విభావయే
గౌరీ.. ఓం.. గౌరీ.. ఓం..
అర్జున మంత్రం అపురూపం
అర్జున మంత్రం అపురూపం
శృంగారానికీ మణిదీపం
శృంగారానికీ మణిదీపం
అర్జున మంత్రం అపురూపం
మదన జనకుడికి ఆహ్లాదం
మా జనకుడికిది అవరోధం
మదన జనకుడికి ఆహ్లాదం
మా జనకుడికిది అవరోధం
మనో వేగమున మరో లోకమున
మనోరథములిటు పరుగిడగా
మనో వేగమున మరో లోకమున
మనోరథములిటు పరుగిడగా
సుభద్రార్జునలమూ మేమే
సుభద్రార్జునలమూ..
సుభద్రార్జునలమూ మేమే
సుభద్రార్జునలమూ..
ఆఆ...ఆఆఆ..ఆఆఅ..ఆఆఆఅ..
సరి నిరిస..
తాత్ తరికిట తాత్ తరికిట
తద మదప..
తాత్ తరికిట తాత్ తరికిట
నిరిస తాత్ తరికిట
రిమగ తాత్ తరికిట
గపమ గపమ మగనిస
తాత్ తరికిట తాత్ తరికిట
నెలవంకల్లో ఉంచి నవ్వూ..
ఇలవంక రావేమి నువ్వూ ..
హహ..హహ..అహ్హహ్హ..
హహ..హహ..అహ్హహ్హ..
నెలవంకల్లో ఉంచి నవ్వూ..
ఇలవంక రావేమి నువ్వూ ..
గుండెతోటలో గుత్తులేసిన మొక్కజొన్న పాలకంకి
చుక్క ముగ్గులా నింగి ముంగిటా నక్కి ఉన్న బాలఎంకి
మక్కువైన పిల్ల ఎంకి హా మక్కువైన పిల్ల ఎంకి నా ఎంకి
హే.. హే.. ఏహే..
నెలవంకల్లో ఉంచి నవ్వూ..
అహ ఇలవంక రావేమి నువ్వు ..
నెలవంకల్లో ఉంచి నవ్వూ..
అహ ఇలవంక రావేమి నువ్వూ ..
తేట తేట నీరు వోసి తేటు లలగ పూలు కోసి
తేట తేట నీరు వోసి తేటు లలగ పూలు కోసి
చిగురాకుల నీ వ్రేళుళు చిదిమినంత చిగురులాయె
చిగురాకుల నీ వ్రేళుళు చిదిమినంత చిగురులాయె
ఓ అరాళ కుంతలా శకుంతలా
మదనుని పదవులు పెదవులు మరి ఒక మారిటు సొకగ
గపనిద పాపప పాపప నిసమగ సాసస సాసస
ప్రణయపరీరంభవేళ చుంబనమై నను తాకగ
గపనిద పాపప పాపప నిసమగ సాసస సాసస
రావే ఇటు రావే .. ఊహూ.. ఊఊహుహు..
సురతమో అది నవరస భరితమో ఆఅ..ఆఅ..
సురతమో అది నవరస భరితమో
రతి మదనుల భరతమో
మరి భరతుని ఉదయమో
3 comments:
వంశీ ఈళయరాజాగారి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాటా ఓ ఐ ఫీస్టే కదండీ..
అవును శాంతి గారూ.. కాదనలేని సత్యం.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
మదనుని పదముల పెదవులు
నదుముకొనుచు మురి సెనోయి నర్జున మంత్రం!
కదనమున కలువ చెలువక
నుదోయి సుందరి జిలేబి నున్నతి గానన్!
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.