సీతారామ కళ్యాణం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సీతారామ కళ్యాణం (1986)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
కలలన్నీ పంటలై పండెనేమో
కలిగింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగబంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై
వినిపించు వేళలో .. ఎన్నెన్ని భావాలో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
చూశాను ఎన్నడో పరికిణీలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో
కనిపించు గోములో .. ఎన్నెన్ని కౌగిళ్ళో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
2 comments:
ఈ పాట మొదటి సారి కంటే వినగా వినగా మనసుకి బాగా దగ్గరైంది..
నాకు ఈ పాట ఈ సినిమాలో అన్ని పాటలూ ఇష్టమేనండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.