మంగళవారం, సెప్టెంబర్ 06, 2016

వనిత..లత..కవిత...

కాంచనగంగ చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కాంచన గంగ (1984)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..
వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..
ఇవ్వాలి చేయూత ..
మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత
వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

పూలురాలి నేలకూలి... తీగబాల సాగలేదు..
చెట్టులేక... అల్లుకోక... పూవు రాదు నవ్వలేదు
మోడు మోడని తిట్టుకున్నా... తోడు విడిచేనా?
పులకరించే... కొత్త ఆశ  తొలగిపోయేనా?

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

ఆదరించే ప్రభుతలేక... కావ్యబాలా నిలువలేదు..
కవిత ఐనా... వనిత ఐనా... ప్రేమలేకా పెరగలేదు..
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా?
చేదు మింగి... తీపి నీకై పంచమరిచేనా?

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

తనది అన్న..గూడులేక కన్నెబాల బతకలేదు..
నాది అన్న తోడులేక... నిలువలేదు విలువలేదు
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా?
వెలుగులోన... నీడలోన నిన్ను మరిచేనా..

వనిత..లత..కవిత
మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత
మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత
 


2 comments:

బాలూగారి గొంతులోంచి జాలువారినందు వల్లే ఈ పాట ఇంత అందం గా అనిపిస్తోందనుకుంటా..

బాలుగారి గొంతు గురించి చెప్పేదేముంటుందండీ అంతే అనడం తప్ప :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.