ఆదివారం, సెప్టెంబర్ 25, 2016

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు...

ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా కుర్రకారును ఊపేయగల సత్తా ఉన్న ఒక హుషారైన పాటను ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు
చెలిమికెపుడూ జతగాళ్ళు చెడుపుకెపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాతసంకెళ్ళు
మనుషులె మన నేస్తాలు కమాన్ క్లాప్.. మనసులె మన కోవెళ్ళు
మనుషులె మన నేస్తాలు మనసులె మన కోవెళ్ళు..యెవ్రీబడీ
మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు ..
కమాన్ యెవ్రీబడీ జాయిన్ టుగెదర్..

4 comments:

ఈ సినిమా టాగ్ లైన్ ఇది ఒక పాటల పందిరి అని ఉంటుందండి..సో ట్రూ..ఇక బాలచందర్ గారు కమల్, యం.యస్.విశ్వనాధ్ గార్ల కాంబినేషన్ గురించి చెప్పేదేముంది..

అవును శాంతి గారు.. అన్ని పాటలు భలె ఉంటాయి.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

మాది భీమవరం నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఎక్కడైన ఏవైనా ఉత్సవాలు లాంటివి జరిగితే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెడితే ఈ పాట పాడకుండా ఆర్కెస్ట్రా వాళ్ళని స్టేజ్ దిగనీయరు ఈ రోజు కు కూడా.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అజ్ఞాత గారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.