చిరంజీవులు చిత్రంలోని ఓ సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : చిరంజీవులు (1956)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : మల్లాది
గానం: పి.లీల, ఘంటసాల
ఎందాక.. ఎందాక.. ఎందాక?
అందాక.. అందాక.. అందాక
ఎందాక.. ఎందాక.. ఎందాక?
అందాక.. అందాక.. అందాక
ఎందాక.. ఎందాక.. ఎందాక?
అందాక.. అందాక.. అందాక
ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి
ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి
ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...
ఎందాక.. ఎందాక.. ఎందాక?
అందాక.. అందాక.. అందాక
చివ్వునపోయి రివ్వున వాలి
చిలకను సింగారించాలి
ఓ..చిలకను సింగారించాలి
పువ్వులతోనా... ఆహా... రవ్వలతోనే హా...హహ
మా నాన్న కోడలు బంగారుబొమ్మా
మా నాన్న కోడలు బంగారుబొమ్మా
ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...
ఎందాక.. ఎందాక.. ఎందాక?
అందాక.. అందాక.. అందాక
అయితే గియితే అమ్మాయి ఎవరో
ఆడేపాడే అందాల బాల
అయితే గియితే అమ్మాయి ఎవరో
ఆడేపాడే అందాల బాల
అయితే బువ్వో... నేతి మిఠాయి ఆ...హా..
పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి
పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి
ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...
ఎందాక.. ఎందాక.. ఎందాక?
అందాక.. అందాక.. అందాక
హేయ్...
ఎందాక? ఎందాక? ఎందాక?
అందాక అందాక అందాక
కన్నులు నిండే కలకలలే
కన్నెకు సొమ్ముగ తేవాలి
నవకాలొలికే నీ చిరునవ్వే
నవకాలొలికే నీ చిరునవ్వే
చిలకకు సింగారం కావాలి
కావాలి కావాలి కావాలి
పరుగున రావాలి రావాలి రావాలి
కావాలి కావాలి కావాలి
పరుగున రావాలి రావాలి రావాలి
2 comments:
పాటా, పిక్ రెండూ భలే ఉన్నాయండీ..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.