శనివారం, సెప్టెంబర్ 24, 2016

వలచీనానమ్మ.. హమ్మా..

మహదేవన్ గారు స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
 

చిత్రం : భార్య బిడ్డలు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల,  సుశీల

వలచీనానమ్మ.. హమ్మా.. హమ్మా.. హమ్మా.. హమ్మా
వలచీనానమ్మ...
వలచినానని తెలిసికూడా నే పలకరించినా పలకడమ్మా
వలచీనానమ్మ.. వలచీనానమ్మ..
హేయ్..
వలచీనావమ్మా..  హమ్మా.. హమ్మా.. హమ్మా.. హమ్మా
వలచీనావమ్మా
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా... వలచీనావమ్మా

కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి
కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కళ్ళు కలిపితే ఊరకపోదు.. కలతేరేగేను..

వలచీనానమ్మ.. హమ్మా.. హమ్మా.. హమ్మా.. హమ్మా
వలచీనానమ్మ...
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా... వలచీనావమ్మా

వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
వయసే ఒంటికి చెరుపౌతుంది.. వదలి ఊరుకుంటే

వలచీనానమ్మ.. హమ్మా.. హమ్మా.. హమ్మా..
వలచీనానమ్మ...
వలచినావని తెలిసినంతనే  పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా... వలచీనావమ్మా


2 comments:

జయలలిత..మే గాడ్ బ్లెస్ హెర్ విత్ కంప్లీట్ హెల్త్..

ఎస్ శాంతి గారు విన్నప్పుడు నేను కూడా అదే అనుకున్నానండీ.. తమిళ సోదరులు బాగా చూస్కుంటార్లెండి నో డౌట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.