అమరశిల్పి జక్కన్న చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
కనులు చేపలై గంతులు వేసె
మనసు తోటలో మల్లెలు పూసె
దోసిట వలపుల పూవులు నింపీ
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
చల్ల గాలితో కబురంపితిని
చల్ల గాలితో కబురంపితిని
చందమామలో వెదకితి నోయీ
తార తారనూ అడిగితి నోయీ
దాగెద వేలా? రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
నల్లని మేఘము జల్లు కురియగా
నల్లని మేఘము జల్లు కురియగా
ఘల్లున ఆడే నీలినెమలినై
నిను గని పరవశమందెద నోయీ
కనికరించి ఇటు రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
2 comments:
ఈ మూవీ లో సాంగ్సన్నీ చాలా మధురం గా ఉంటాయండీ..
అవునండీ అన్ని పాటలు బాగుంటాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.