శుక్రవారం, సెప్టెంబర్ 09, 2016

ఇల్లే ఇలలో స్వర్గమనీ...

ఇల్లు ఇల్లాలు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియొ లొడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇల్లు-ఇల్లాలు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : అప్పలాచార్య
గానం : బాలు,  సుశీల  

ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు
మనసే మనిషికి అందమనీ మగడే శ్రీమతి దైవమనీ 
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు

మైకమనే చీకటిలో మమత కోసమై వెదికాను
మైకమనే చీకటిలో మమత కోసమై వెదికాను
కాంతి కిరణమై కనిపించీ.. జీవన జ్యోతిని వెలిగించావు
అందముగా అందానికి ఒక బంధముగా
అందముగా అందానికి ఒక బంధముగా
తొలినోముల ఫలమై దొరికావు.. నను వీడని నీడై నిలిచావు  

ఇల్లే ఇలలో స్వర్గమనీ.. ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు

చల్లని కన్నులలో వెలిగే వెన్నెల దీపాలూ
నా చిరునవ్వుకు ప్రాణాలు..  మన ప్రేమకు ప్రతిరూపాలూ
నీ పెదవుల రాగములో విరిసే తీయని భావాలు
ఆనందానికి దీవెనలు.. మన అనుబంధానికి హారతులూ 

మనసే మనిషికి అందమనీ.. మగడే శ్రీమతి దైవమనీ
ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు

నాలో సగమై నీవే జగమై.. నేనే నీవుగ మారావు..
నాలో సగమై నీవే జగమై.. నేనే నీవుగ మారావు
మారని మనిషిని మార్చావు..  బ్రతుకే పండుగ చేశావు
పెన్నిధివై అనురాగానికి సన్నిధివై..
కనులముందు వెలిశావు..నా కలలకు రూపం ఇచ్చావు    

ఇల్లే ఇలలో స్వర్గమనీ.. ఇల్లాలే ఇంటికి దేవతనీ
ఋజువు చేశావూ..  నీవు ఋజువు చేశావు
అహహ హాహాహాహా.. అహహ హాహాహాహా..
లలలలాలలలా.. లలలలాలలలా

2 comments:

మా అక్కకి చాలా ఇష్టమైన పాటండి..నాకు అక్కని గుర్తు చేసే పాట..థాంక్యు ఫర్ పోస్టింగ్..

ఓహ్ అవునా.. ఆ విషయాన్ని మాతొ పంచుకున్నందుకు థాంక్స్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.