మంగళవారం, సెప్టెంబర్ 20, 2016

సన్నజాజి సెట్టు కింద...

బ్రహ్మపుత్రుడు చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవ్వని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బ్రహ్మ పుత్రుడు (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల 

సన్నజాజి సెట్టు కింద చలవా చలవా
చిన్నమ్మకెందుకింత గొడవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నమ్మకెందుకింత గొడవ
దాని వయ్యారి రూపమెంత నడవా
అది గోదారి మీద గూటి పడవా
దాని తోడుంటే నాకు ఏం తక్కువ

ఓ..ఓ.. సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
ఆడి ముద్దుకుంది ముత్యమంత విలవా
ఆడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా
ఆడి కౌగిళ్ళకుంది ఎంత మక్కువ


సందేళ నింగిలోన సుక్కపొడిచి..
దాన్ని సందిళ్ళలోన ఈడు నిక్కబొడిచి
పిల్ల గాలి పైటలాగి పక్క పరిచి
అహ.. లేత ఎండ దాని మీద పూలు పరచి
దాని సోకు చూడగానే మైమరచి
నీడలాగ వెంటపడిపోదలచి
అందాలు ఇచ్చుకుంటా ఆకు మడచి

హోయ్.. సందిళ్ళకొచ్చిపోరా మావా
అరె.. గున్నమావితోటలోకి కన్నెపిల్ల రావే

సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ

సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
ఆడి ముద్దుకుంది ముత్యమంత విలువా
ఆడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా

దాని తోడుంటే నాకు ఏం తక్కువ
హోహో.. సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ

కాశ్మీర  లోయవంటి కన్నె సొగసు
కవ్వింత పూలు జల్లె ఉన్నవయసు

కన్యాకుమారి మీద నాకు మనసు
కంటిపాపాయి ఏమందో నాకు తెలుసు
మంచుపూల పందిరేసే మాఘమాసం
మాపటేళకొచ్చాను నీకోసం

నల్లమబ్బు చీకటొచ్చె మనకోసం
నాటాలి ముద్దుతో సందేశం
అరె..కంచెదాటి పోయింది చేను కూడా మావా
 
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ

దాని వయ్యారి రూపమెంత నడవా
అది గోదారి మీద గూటి పడవా
ఆడి కౌగిళ్ళకొస్తే ఎంత మక్కువ
 
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ

2 comments:

పాటలలో మల్లెపూలకి చేసినంత న్యాయం మన కవులు సన్నజాజి పూలకి చేయలేదు సుమండీ..

హహహ అంతేనంటారా శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.