తలంబ్రాలు చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవని వాళ్ళు వీడియో ఇక్కడ చూడవచ్చు.
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
చిత్రం : తలంబ్రాలు (1986)
సంగీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుశీల, బాలు
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో...
నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. నీడలా నాతో ఉండిపో... హొ
గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది
హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
ఏ వేళనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ
కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నాతో ఉండిపో...
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
2 comments:
ఈ సినిమా చాలా బావుంటుంది..
హా అవునండీ మంచి సినిమా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.