మిత్రులందరకూ వినాయకచవితి శుభాకాంక్షలు. ఆ గణపతిని తలచుకుంటూ దేవుళ్ళు సినిమాలోని ఒక చక్కని పాటను పాడుకుందామీరోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవుళ్ళు (2000)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..
భాహుదా నది తీరములోన
బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహ పరముల నిడు మహానుభావా
ఇష్టమైనదీ వదిలిన నీ కడ
ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరములనోసగుచు
నిరతము పెరిగే మహాకృతి...
సకల చరాచర ప్రపంచమే
సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం
ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం.. విఘ్న నాశనం
కాణిపాకమున నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
పిండి బొమ్మవై ప్రతిభ చూపి
బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో
మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు
గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి
లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్పగా
లక్ష్మి గణపతి వైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు
కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని
విబుధులు చేసే నీ కీర్తనం...
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్దివినాయక
ఆ.ఆ....ఆ....ఆ....ఆ...
2 comments:
మీకూ మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు వేణూజీ..
థాంక్స్ శాంతి గారు.. మీక్కూడా వినాయకచవితి శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.