మావిచిగురు సినిమాలో అల్లురామలింగయ్య గారు జీన్స్ పాంట్ వేస్కుని అమ్మాయిల వెంటపడుతూ ఆటపట్టించే ఈ పాటను రంజుభలే రాంచిలుక అన్న రాజబాబు గారి పాటలోని పదాలను వాడి అల్లు గారిదే ముత్యాలూ వస్తావా అన్న పాట బాణీలో స్వరపరిచిన పాట. సో ఆల్మోస్ట్ దానికి రీమిక్స్ అనుకోవచ్చేమో. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. వీడియో క్వాలిటీ తక్కువగా ఉంది సో యూట్యూబ్ లో ఆడియో సాంగ్ ఇక్కడ వినవచ్చు.
చిత్రం : మావిచిగురు (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, అనుపమ
హే లవ్లీ గర్ల్స్ .. ఇట్సె బ్యూటిఫుల్ డే..
యూ ఆర్ సో యంగ్..
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
సిద్ధం అంటే సరదా పడదామే..ఏ..ఏ..
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముస్తాబంతా చిత్తైపోతుందే..ఏ..ఏ..
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
ఇక ఒరిజినల్ సాంగ్ ముత్యాలు వస్తావా పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : బాలు, సుశీల
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో
నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ
ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
నిన్నూ నన్నూ చూస్తే నామరదా
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను
ఉన్నదంత ఇచ్చేసీ నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకునుంటానూ
అహా... ఒహో.. ఏహే.. ఏ..
ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను
ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో
రేవులోన నిను ముంచేస్తానయ్యో
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో
2 comments:
రెండు వెర్షన్సూ టూ గుడ్..
థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.