శుక్రవారం, జులై 03, 2020

నిన్ను రోడ్డు మీద...

ఈ రోజు సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య రీమేక్ చేసిన ఓ పాటను తలచుకుందాం. ఈ రీమిక్స్ పాటను కూడా ఒరిజినల్ స్వరపరచిన కీరవాణి గారే స్వరపరచడం విశేషం. పల్లవిని మాత్రం వాడుకుని చరణాన్ని మార్చి రాసేసుకుని మరింత ర్యాప్ చేర్చేసి రీమిక్స్ చేసిన ఈ పాట విశేషమేంటో మీరే చూసేయండి. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సవ్యసాచి (2018)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి, వేటూరి 
గానం : పృథ్వీ చంద్ర, మౌనిమ చంద్రభట్ల, 

నూనూగు మీసాల నూత్న యవ్వనమున
మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో
మొదలైందీ ప్రేమ కహానీ
ఆ కాంటీన్ లో సొల్లు కబుర్లు 
నైటంతా బైక్ షికారులు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
రిపీట్టే
మరపురావు కాలేజీ రోజులు

యో యు రాక్డ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

ఇట్స్  గెట్టింగ్ హాటర్ లగ్గాయతు
మై హార్ట్ ఈజ్ బౌన్సింగ్ 
ఎన్ ఫాలింగ్ యట్ యూ

ఓసి ఓసి ఓసి రాక్షసి
కాస్త నువ్వు చూడు నాకేసి
నువ్వే కదా నాకు  ప్రేయసి
లాగ్ లాగ్ లగ్ లగ్గాయతు

నిన్ను నన్ను చూసేటోల్ల
కళ్ళు మొత్తం కుళ్లిపోను
నిన్ను నేను కొంచమైనా
చూడకుండా ఉండలేను
నువ్వు నన్ను ఆగమన్న
నేను  అసలు ఆగలేను
నీకు నేను ఎపుడైనా
కచ్చితంగా మొగుడవుతాను
నువ్వు  నేను కలిసి మోత్తం
దునియానంత దున్నేద్దాము
తుబిందా.. లగాయతు.. 

లైలా మజ్ను
లగ్గాయతు లగ్గాయతు
దేవ్ డి పారు
లగ్గాయతు లగ్గాయతు
మై దీవానీ తూ దీవానా

హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో
థియేటర్ లో చీకటి కార్నర్ లో
చెయ్యి చేయీ తగిలేలా
గురుతుందా రసలీలా

లేట్ నైట్ లో లైవ్ చాట్ లో 
ఎన్ని పాటలో హార్ట్ బీటులో 
అల్లరి ఊసులు చిల్లర ఊహాలు
ఎన్నని చెప్పను పిల్లో మరదల్లో

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నిన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఒరిజినల్ వర్షన్ అల్లరి అల్లుడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అల్లరి అల్లుడు (1993)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, చిత్ర 

నూనూగు మీసాల 
నూత్న యవ్వనమున
ఏలూరు సి.ఆర్.రెడ్డి. కళాశాలలో
ఓ రాణీ ప్రేమ పురాణం
ఆ ముచ్చటకైన ఖర్చూ
రోజంతా జంట షికార్లు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు 
వన్స్ మోర్ 
మరపు రావు కాలేజీ రోజులు
వాహ్ క్యాబాత్ హై.. 

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

కాంచనమాల లగాయతు లగాయతు
సూర్యకుమారి లగాయతు లగాయతు
నేను కానా నీకు లేనా

ఆరోజుల్లో మీ ఆడాళ్ళల్లో
కట్ బ్లౌజుల్లో లైలా పోజుల్లో
మొహమాటాలే విడిచీ  
మొగుడాటల్లో గెలిచీ
ప్లాటుఫారమో పార్కు తీరమో
ప్రేమలేఖలా రాయబారమో
జన్మకు రానిది  
మన్మధ సీజను 
ప్రేమతపాలపు అడ్రెసు
U MY LOVEEEE

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

SD బర్మన్ లగాయతు లగాయతు
ఆనంద్ భక్షి లగాయతు లగాయతు
నీది రాగం నాది భావం

ఈ కౌగిట్లో సాగే డ్యూయెట్లో
సిగ్గందిట్లో జారే సందిట్లో
చలిపాఠాలే చదివీ వలపాటల్లో కరిగీ
లవ్ పరీక్షలో ఫష్టు ర్యాంకులో
హిట్టు కొట్టనా జట్టు కట్టనా
నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల 
ప్రేమ జపాలకు మంత్రం
I LOVE UUUUUUU

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు క్వాక్ క్వాక్

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు
   

2 comments:

original song ni picturize chesinattu remix ni cheyyaledu,
thank you for posting lyrics

అవునండీ కొంత మోడార్నైజ్ చేసే ప్రయత్నం విఫలమైందనిపించింది. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.