జీవిత చక్రం సినిమాలోని "కంటి చూపు చెపుతోంది" పాటను పైసా వసూల్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పైసా వసూల్ (1971)
సంగీతం : శంకర్-జైకిషన్
రీమిక్స్ : అనూప్ రూబెన్స్
సాహిత్యం : ఆరుద్ర
గానం : మనో
సాధారణంగా ఘంటసాల గారు అనగానె గంభీరమైన స్వరం చక్కని మెలోడియస్ వాయిస్ గుర్తొస్తుంటుంది నాకు, అటువంటిది ఆయన ఇలాంటి పెప్పీ పాట పాడటం వినడానికి భలే తమాషాగా అనిపిస్తుంటుంది. అన్నగారి అభినయం ఘంటసాల గారి గళం ఒకదానికొకటి భలే సూట్ అవుతాయి ఈ పాటలో. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జీవిత చక్రం (1971)
సంగీతం : శంకర్-జైకిషన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు.. ఆశలు దాచకు
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఓ పిల్లాఆ...
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా..
అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా
స్నేహము చేయవా - స్నేహము చేయవా
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఓ పిల్లాఆ...
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా - రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా..
మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది - ఓ పిల్లా
మైకము పెంచుకో - మైకము పెంచుకో
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఒ పిల్లాఆ...
చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా..
నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి
ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా?
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
2 comments:
జయహో యన్.టి.ఆర్..
థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.