ఒక లైలాకోసం సినిమాలో ఏఎన్నార్ గారి సూపర్ హిట్ సాంగ్ "ఒక లైలా కోసం" రీమిక్స్ చేశారు. పాత్ర స్వభావాలని బట్టి చరణంలో కాస్త మార్పులు తప్ప పాటంతా దదాపు అలాగే వాడేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఒక లైలా కోసం (2014)
సంగీతం : చక్రవర్తి
రీమిక్స్ : అనూప్ రూబెన్స్
సాహిత్యం : దాసరి
గానం : ఎస్.పి.చరణ్, దివ్య
ఒక లైలా లైలా లైలా
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం
లైలా లైలా లైలా..
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
లైలా లైలా లైలా.. లైలా లైలా లైలా..
అకాశానికి నిచ్చెనవేసి
చుక్కల పట్టుకునడిగాను
లైలా ఏదనీ నా లైలా ఏదనీ
స్వర్గానికి నే దారులు వెతికీ
ఇంద్రుని పట్టుకునడిగానూ
లైలా ఏదనీ నా లైలా ఏదనీ
అక్కడ ఇక్కడ ఎక్కడనీ
దిక్కులు వెతుకుతు ఉన్నావూ
లైలా కోసం మజ్నూలా
ఎందుకు తికమక పడతావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ
ప్రతి చోటా నీకోసం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
పగలూ రేయీ పందెం వేసీ..
సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్నూ ఏడనీ.. నా మజ్నూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ..
స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. ఆ లైలా నేననీ
ఇల్లూ వాకిలి వదిలొస్తే
రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే..
ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి రోజు ప్రతి రాత్రీ
ప్రతి పాటా ఆమెకోసం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రీ
ప్రతి పాటా ఆమెకోసం
లైలా లైలా లైలా..
ఒక లైలా లైలా లైలా
ఒక లైలా లైలా లైలా
అక్కినేని గారు డిస్కో స్టెప్పులతో చిత్తుచేసిన ఒరిజినల్ సాంగ్ ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాముడు కాదు కృష్ణుడు (1983)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ
.. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా... లైలా... లైలా
ఒక మజ్నూ కోసం వెతికాను లోకం
ఒక మజ్నూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ
ప్రతి తలపూ అతని కోసం
మజ్నూ... మజ్నూ... మజ్నూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ఆకాశానికి నిచ్చెన వేసీ...
చుక్కల పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ...
స్వర్గానికి నే దారులు వెతికీ..
ఇంద్రుని పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ
దిక్కుల నడుమా నేనుంటే..
చుక్కల పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ నేనుంటే..
కన్నులు మూసుకు వెదికావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ...
ప్రతి చోటా నీ కోసం
ఒక మజ్నూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ..
ప్రతి తలపూ అతని కోసం
లైలా...లైలా...లైలా
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
పగలూ రేయీ పందెం వేసీ..
సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్నూ ఏడనీ.. నా మజ్నూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ..
స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ
ఇల్లూ వాకిలి వదిలొస్తే
రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే..
ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ..
ప్రతి తలపూ నీ కోసం
ఒక మజ్నూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ
.. ప్రతి తలపూ అతని కోసం
మజ్నూ...మజ్నూ...మజ్నూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ..
ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా...లైలా...లైలా
2 comments:
యెవ్వర్ గ్రీన్ సాంగ్..
థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.