బుధవారం, జులై 22, 2020

వానా వానా వెల్లువాయే...

రచ్చ సినిమా కోసం గ్యాంగ్ లీడర్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ వానావానా వెల్లువాయే పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గ్యాంగ్ లీడర్ (2012)
సంగీతం : బప్పీలహరి
రీమిక్స్ : మణిశర్మ
సాహిత్యం : భువనచంద్ర 
గానం : రాహుల్ నంబియార్, చైత్ర  

ఇక ఈ పాట ఒరిజినల్ వర్షన్ లో చిరంజీవి విజయశాంతి డాన్స్ చేయలేదు సింపుల్ గా పాటతో ఆడుకున్నారు అని అప్పట్లో టాక్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం : బప్పీలహరి
సాహిత్యం : భువనచంద్ర 
గానం : బాలు, చిత్ర 

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకులా చలికి ఒణుకుతూ 
చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే 
కొండకోన తుళ్లిపోయే

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై 
పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 
 

2 comments:

చిరంజీవిగారి గ్రేస్ యెవరికైనా అసాధ్యమే సుమా..

నో డౌట్ అండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.