అల్లరి రాముడు చిత్రం కోసం "వేటగాడు" సినిమాలోని సూపర్ హిట్ పాటను రీమేక్ చేశారు. ఐతే ట్యూన్ మాత్రమే ఉపయోగించుకుని లిరిక్ మార్చేసిన ఈ పాట విశేషం ఏంటో మీరూ చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అల్లరి రాముడు (2002)
సంగీతం : చక్రవర్తి
రీమిక్స్ : ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం : పోతుల రవికిరణ్
గానం : బాలు, ఉష
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
సోకుల్తో వచ్చేసింది సూదుల్తో గుచ్చేసింది
చినుకుల్తో చిందేసింది జివ్వంటూ లాగేసింది
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గొడవొచ్చింది
రవ్వంత నొప్పేసింది మువ్వంత ముద్దేసింది
ఊరించి ఓ మెరుపు రాగాలు తీస్తుంటే
అహ అహ అహా అహ
ఉడికించి ఓ చినుకు గారాలు పోతుంటే
అహ అహ అహా అహ
ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే
ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే
ఊగిందే నీ నడుము తడి ఆరిపోతుంటే
కోరింది నీ కిచ్చుకుంటే ఆహా
సయ్యటలే ఆడుకుంటే ఊరుకుంటే జారుకుంటే
ఆకు చాటున్న పిందల్లే నే ఉంటే
అహా అహా ఆహా అహా అహా ఆహా
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
మత్తోచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే
అహ అహ అహా అహ
మత్తోచ్చి నాకేమో మతి తప్పిపోతుంటే
అహ అహ అహా అహ
ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే
ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే
నీ మత్తు మాటలతో వెన్నే సలిపేస్తుంటే
అహా ఈ వానలో కన్ను గీటి, అహా
రసవీణలా నిన్ను మీటి
వరస తెలిసి వయసు కురిసి
మనసులోతుల్లో ఉయ్యాల లుగాలి
అహా అహా ఆహా అహా అహా ఆహా
రెండువేల రెండు వరకు అహా అహా అహా అహా
చూడలేదే ఇంత సరుకు అహా అహా అహా అహా
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
సోకుల్తో వచ్చేసింది సూదుల్తో గుచ్చేసింది
చినుకుల్తో చిందేసింది జివ్వంటూ లాగేసింది
పోక పోక తోటకెళితే అహా అహా అహా అహా
వేటగాడు వెంటపడితే అహా అహా అహా అహా
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గొడవొచ్చింది
రవ్వంత నొప్పేసింది మువ్వంత ముద్దేసింది
లాలాల లాలాలలా లాలాల లాలాలలా
లాలాల లాలాలలా లాలాల లాలాలలా
~*~*~*~*~*~*~*~*~*~*~
రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెలుగు యువతరాన్ని ఒక ఊపు ఊపేసిన ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మ చాటు పువ్వు తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మ చాటు పువ్వు తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
అహ అహ .. అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి ..అహ
జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ .. అహా అహ అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ .. నీ పాట విని మెరుపులొచ్చి... అహ
నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
ఆకు చాటు పిందె తడిసే.. ఆహా అహా అహా అహా
కొమ్మచాటు పువ్వు తడిసే.. ఆహా అహా అహా అహా
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మచాటు పువ్వు తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
4 comments:
శ్రీదేవంటే..శ్రీదేవేనండి..
హహహ అంతే కదండీ మరి :-) థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
vetgadu cinema ki apprentice gaa cherina B Gopal, chethulara chedagottina paata,
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.