మంగళవారం, జులై 07, 2020

మబ్బులు కురిసే...


భావుకురాలైన ఓ అమ్మాయి తన ప్రేమనంతటినీ అక్షరాలలో పెడితే ఇదిగో ఈ పాటలా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో మది పులకింపచేసే ఈ చల్లని వర్షాకాలంలో అంతే సున్నితమైన భావాలతో ఈ రోజు పుట్టిన నా నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాటను తనకి అంకితమిస్తున్నాను. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
 

చిత్రం : మల్లెలతీరం (2013)
సంగీతం : పవన్ కుమార్
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
గానం : క్రాంతి   

తన్నననన తన్నననన తానననన
తతన్నననన తన్నననన తానననన

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే 
మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే 
ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం
చినుకై రాలెను సంతోషం
తీయని తేనెల సావాసం
తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం
సాగర సంగమ ప్రియ దాహం

మల్లెలు పూసే మౌనం విరిసే మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే ఎద ఎగసే

ఏ జన్మ కథ మళ్ళీ మొదలై 
నా జన్మ కదిలిందీ
ఆశగ నీతో అడుగేస్తుంటే 
అణువణువు అదిరిందీ
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
చిరు చిరు గాలులు తాకిన నీవని
చిరు సడి విన్నా అది నీ మాటని
మమతల ముడి పడి 
మురళిగ నిలబడి 
మానస కోయిల కూసెనుగా

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే 
మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే 
ఎద ఎగసే

ఏ కొమ్మ తొలి సిగ్గుల మొగ్గై 
ఏ చోట పూస్తుందో
ఉరికే వాగులు పారే యేరులు 
చేరే తీరాలేవో
తెలుసా వాటికి తమ తలరాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
తెలుసా వాటికి తమ తలరాతలు
తెలిసిన ఆగవు వలచిన చరితలు
పూవుల ఘుమ ఘుమ 
మువ్వల సరిగమ
ఎవ్వరు ఆపిన ఆగవుగా

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే 
మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే 
ఎద ఎగసే

నా చూపులకు సోయగమిచ్చి 
నీ కంటి కళవచ్చీ
నువ్వే నేనని భావన చేస్తూ 
నాతో నేను రమించీ
చూసేదంతా సొగసనిపించి
చేసేవన్నీ నిజమనిపించె
చూసేదంతా సొగసనిపించి
చేసేవన్నీ నిజమనిపించె
గువ్వల కిల కిల 
నవ్వుల పరిమళ
మల్లెల తీరము కనిపించీ
మల్లెల తీరము కనిపించీ

తన్నననన తన్నననన తానననన
తతన్నననన తన్నననన తానననన

మబ్బులు కురిసే మొగ్గలు విరిసే 
మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే 
ఎద ఎగసే
మబ్బులు కురిసే మొగ్గలు విరిసే 
మది మురిసే
దిక్కులు మెరిసే చుక్కలు విరిసే 
ఎద ఎగసే
చేతికి అందెను ఆకాశం
చినుకై రాలెను సంతోషం
తీయని తేనెల సావాసం
తోడై దొరికెను ఈ సమయం
సుడులై పొంగిన నది వేగం
సాగర సంగమ ప్రియ దాహం
మల్లెలు పూసే మౌనం విరిసే 
మది మురిసే
కన్నులు మెరిసే వెన్నెల కాసే 
ఎద ఎగసే 

లల్లలలాల లల్లలలాల లాలలాలల
లల్లలలాల లల్లలలాల లాలలాలల
 

2 comments:

మా విషెస్ కూడా అందచేయండి మీ నేస్తానికి..

థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.