గురువారం, జులై 30, 2020

ఏమయిందో ఏమో...

పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన నితిన్ తన "గుండెజారి గల్లంతయ్యిందే" సినిమా కోసం పవన్ "తొలిప్రేమ" సినిమాలోని "ఏమయ్యిందో ఏమో ఈ వేళ" అనే పాటను రీమిక్స్ చేశాడు. ఈ పాటతో ఈ సిరీస్ ను ముగించేద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం : దేవా
రీమిక్స్ : అనూప్ రూబెన్స్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : రాంకీ 

నిజానికి ఈ పాట స్పానిష్ సింగర్ "రిక్కీ మార్టిన్" కంపోజ్ చేసి పాడిన "మరియా" అనే పాటకు ఫ్రీమేక్. పాట మొదటి లైన్స్ సైతం డైరెక్ట్ గా తీసుకున్నారు. ఆ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఇక పవన్ నర్తించిన ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తొలిప్రేమ (1998)
సంగీతం : దేవా
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు  

(( స్పానిష్ లిరిక్స్ ))
Uépa

Un, dos, tres un pasito pa'delante María
Un, dos, tres un pasito pa' atrás
Un, dos, tres un pasito pa'delante María
Un, dos, tres un pasito pa' atrás

Uépa...

Un, dos, tres...

Uépa

(ఇంగ్లీష్ అర్థం) 
(One, two, three,
One small step forward with Maria.
One, two, three,
One small step back.)

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

వెతకాలా వైకుంఠం కోసం 
అంతరిక్షం వెనకాలా
హే ప్రియురాలే 
నీ సొంతం అయితే
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో 
గెలిచే ప్రణయాన
జత వలతో ఋతువులనే 
పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా
ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా

జనులారా ఒట్టేసి చెబుతా 
నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే 
అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అదే కాదా లవ్లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ 
  

2 comments:

పవన్ కల్యాణ్ వీరాభిమాని కదా నితిన్..అందుకే పాట ఫ్లేవర్ అలానే ఉంది..

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.