ఆదివారం, జులై 19, 2020

అందం హిందోళం...

యముడికి మొగుడు సినిమాలో సూపర్ హిట్ అయిన "అందం హిందోళం" పాటను సుప్రీమ్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఒరిజినల్ లో కోరస్ తో పాడించిన ఒక బిట్ ను సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ బిట్ తో కంపోజ్ చేయడం ఈ పాటకు ఒక కొత్త లుక్ తెచ్చి సూపర్ హిట్ చేసేసింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సుప్రీమ్ (2016)
సంగీతం : రాజ్ కోటి
రీమిక్స్ : సాయి కార్తీక్
సాహిత్యం : వేటూరి
గానం : రేవంత్, చిత్ర

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనిధీ.. 
అందగనే.. సందేళకది..
నా శృతి మించెను నీ లయ పెంచెను లే.. హో..

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం

చలిలో దుప్పటి కెత్తిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చెమటారని ముచ్చిలిగుంటలలో...
గుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళ్ళెకాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే.. రుచితెలిపే.. తొలివలపే.. హా
మొటిమలపై మొగమెరుపై జతకలిపే.. హా..
తీయనిది.. తెర తీయనిది...
తీరా అది నీ చేజిక్కినది..
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్

అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం త.. త్తర
తగిలే సుమ బాణం

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై.. హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హే
ఇచ్చినదీ.. కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే.. హే..

అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం ఎ.. ఎహే
తగిలే సుమ బాణం అ.. ఆహా

ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకున్న జంట చిరంజీవి రాధ. చిరుకి చాలా మంది హీరోయిన్స్ తో హిట్ సినిమాలున్నా డాన్స్ విషయంలో చిరంజీవి పక్కన తడబడకుండా డాన్స్ చేయగలిగిన అతి కొద్దిమంది హీరోయిన్స్ లో రాధ ఒకరు. యముడికి మొగుడు చిత్రం లోని అందం హిందోళం పాటను ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

 
చిత్రం : యముడికి మొగుడు (1988)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనిధీ.. 
అందగనే.. సందేళకది..
నా శృతి మించెను నీ లయ పెంచెను లే.. హా..

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం

చలిలో దుప్పటి కెత్తిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చెమటారని ముచ్చిలిగుంటలలో
గుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళ్ళె కాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే.. రుచితెలిపే.. తొలివలపే.. హా
మొటిమలపై మొగమెరుపై జతకలిపే.. హా..
తీయనిది.. తెర తీయనిది...
తీరా అది నీ చేజిక్కినది..
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్.. .హహూ.

కుకువాకుకువావా హ. కుకువాకుకువావా హు.
కుకువాకుకువావా హ. కుకువాకుకువా

అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం త.. త్తర
తగిలే సుమ బాణం త.. త్తర

కువవకువవా.. కువవకువవా

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై.. హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హై
ఇచ్చినదీ.. కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే.. హే..

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం ఎ.. ఎహే
తగిలే సుమ బాణం అ.. ఆహా

సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనిధి.. 
అందగనే.. సందేళకది..
నా శృతి మించెను నీ లయ పెంచెను లే.. హా...



2 comments:

చిరు-రాధ ది బెస్ట్ జోడి..

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.