పచ్చని కాపురం చిత్రంలోని "వెన్నెలైనా చీకటైనా" పాటను "ఒక ప్రేమకథా చిత్రం" సినిమా కోసం రీమేక్ చేశారు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఒక ప్రేమ కథాచిత్రం (2013)
సంగీతం : చక్రవర్తి
రీమిక్స్ : జె.బి.
సాహిత్యం : సినారె
గానం : రేవంత్, మాళవిక
ఇక కృష్ణ శ్రీదేవిలపై చిత్రించిన ఈ ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పచ్చని కాపురం (1985)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : ఏసుదాస్, జానకి
ఆ..ఆ..ఆ..
వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే..
స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు..
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వమూ.. నాదైనదీ..
నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె
ఏకమైన రాసలీలలోనా..
వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
అంతంలేనీ.. నీ రాగ బంధంలో..
అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు..
ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు
ఆ ముద్దులే.. మూడైనవీ..
బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా..
ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా
వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు..

2 comments:
నైస్ రీమిక్స్..
థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.