పాట పేరుతోకన్నా చిత్రీకరించిన పద్దతిని బట్టి బిందెల పాటగా ఫేమస్ అయిన ఈ పాటను "గద్దలకొండ గణేష్" చిత్రంలో రీమేక్ చేశారు. పాట సంగీత సాహిత్యాలను మార్చకుండా హరీష్ శంకర్ రాసుకున్న చక్కని సందర్భానికి తగినట్లుగా కొరియోగ్రఫీ కూడా ఒరిజినల్ పాట శైలిలోనే కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. ఇక ఒరిజినల్ పాటలోని సుశీల గారి స్వరం ఆడియో ట్రాక్ తో సహా ఇందులో ఉపయోగించుకోవడం విశేషం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గద్దలకొండ గణేష్ (2019)
సంగీతం : చక్రవర్తి
సంగీతం : చక్రవర్తి
రీమిక్స్ : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
దేవత చిత్రంలోని ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..

మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు..
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు..
గుండెల్లో చోటుంది చూడు
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట
నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
2 comments:
sridevi andam, raghavendrudi chithreekarana, paataku vanne thechchaayi
thank you for posting the lyrics srikanth garu
అవునండీ అందులో ఏ సందేహం లేదు.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.