గురువారం, జులై 02, 2020

సోగ్గాడే చిన్ని నాయనా...

ఈ జులై నెలంతా రీమిక్స్/రీమేక్ సాంగ్స్ తలచుకుందాం అనుకుంటున్నాను. పాత కొత్త పాటల వీడియోలు లిరిక్ ఏదైనా మారితే ఆ లిరిక్స్ కూడా పంచుకుంటాను. ముందుగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలోని టైటిల్ సాంగ్ తో మొదలు పెడదాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సోగ్గాడే చిన్నినాయన (2015)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : సత్య యామిని, నూతన, వినాయక్

అరె చెక్కెరకెళి చిన్నోడే
చుక్కలు చూపే చందురుడే
సుర్రుమంటు వచ్చాడొచ్చాడే

హే గంధము గట్రా పూయండే
బిందెలు సిద్ధం చేయండే
ఉన్నదంతా పట్టించేయండే

కట్ట కట్టి అందాలన్నీ
నా మీదకి వస్తుంటే
పట్టి పట్టి నన్నే చూసి 
ఇట్టా కవ్విస్తూ ఉంటె
ఎట్టా తప్పుకుంటా సెప్పండే 

సోగ్గాడే చిన్ని నాయనా
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన
సిగ్గులేక్కడెట్టినాడు సోగ్గాడు సోగ్గాడు

చూపు కలిపాడంటే మనసు దోచేస్తాడే
మాట కలిపాడంటే మోళీ చేసేస్తాడే
అరెరెరే...అయ్యో ఆవలించావో ఆశ లెక్కెడతాడే..
మంచోడమ్మ మంచోడనుకుంటే
అడ్డెడ్డెడ్డె ...మంచాలెక్కి మల్లెలు చల్లాడే

అద్దిరబన్న అప్సరలంతా 
వెంట వెంట పడుతూవుంటే
దుడుకెట్ట దాక్కుంటాదే ...
యే యే యే యే...
సోగ్గాడే సోగ్గాడే  సోగ్గాడే
సోగ్గాడే సోగ్గాడే సోగ్గాడే..

సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు

జిల్లా మొత్తం మీద ఇలాంటోడే లేడే
పిల్లాడప్పటినుండి పిల్లంగ్రోవూదాడే
నవ్వే కవ్వం చేసి ప్రాణం చిలికేత్తాడే
అన్నెం పున్నెం తెలిదనుకుంటే
అడ్డెడ్డెడ్డె...అన్నీ అన్నీ చేసేస్తున్నాడే
ఒప్పుల కుప్ప ఒంపుల తిప్ప
సోకుల దెబ్భ ముద్దుల డబ్బా
నాకేం తెలుసే ఇది తప్పా ...హే హే హే..

సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు

ఈ పాట ఒరిజినల్ వర్షన్ ఆస్తిపరులు చిత్రంలోనిది. ఆ పాట పల్లవి లోని లిరిక్స్ అండ్ ట్యూన్ మాత్రమే తీస్కుని రిమిక్స్ చేశారు. ఆ ఒరిజినల్ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆస్తిపరులు (1966)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : కొసరాజు 
గానం : సుశీల 

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..

కట్టె తుపాకెత్తుకోని 
కట్ట మీద నడుస్తుంటే 
కాలుజారి పడ్డాడే సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకోని 
కట్ట మీద నడుస్తుంటే 
కాలుజారి పడ్డాడే సోగ్గాడు
పగటివేషగాడల్లే 
పల్లెటూళ్ళు తిరుగుతుంటే 
కుక్కపిల్ల భౌ అంది.. ఆయ్.. 
పడుసు పిల్ల ఫక్కుమంది.. హహహ..

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..

కళ్ళజోడు ఏసికోని 
గళ్ళకోటు తొడుక్కోని 
పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
కళ్ళజోడు ఏసికోని 
గళ్ళకోటు తొడుక్కోని 
పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
చిట్టివలస వాగుకాడ 
పిట్ట తుర్రుమంటేనూ..
చిట్టివలస వాగుకాడ 
పిట్ట తుర్రుమంటేనూ.. 
బిక్కమొగమేసాడు 
సుక్కలెంక చూసాడూ..
బిక్కమొగమేసాడు 
సుక్కలెంక చూసాడూ..

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..

మూతి మీసం గొరుక్కోని 
బోసి మొహం పెట్టుకోని 
యాట కోసం వచ్చాడే సోగ్గాడు
మూతి మీసం గొరుక్కోని 
బోసి మొహం పెట్టుకోని 
యాట కోసం వచ్చాడే సోగ్గాడు
బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే 
ఎర్రిమొహం ఏసాడు.. హోయ్.. 
మిర్రిమిర్రి చూసాడు.. హూ..హోయ్..

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ
సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..
 


2 comments:

గుడ్ ఐడియా..ఆస్తి పరులు సాంగ్ నాకు చాలా ఇష్టం..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.