శనివారం, జులై 18, 2020

దంచవే మేనత్త కూతురా...

మంగమ్మ గారి మనవడు సినిమాలోని ఈ పాట తెలియని తెలుగు వారుండరేమో. ఈ పాటని తనీష్, నాని నటించిన రైడ్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. రీమిక్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్ర బాగానే దంచడంతో అప్పట్లో కుర్రకారు ఒక రేంజ్ హిట్ చేశారు, నేనూ తెగ వినేవాడ్ని. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. మంచి క్వాలిటీ వీడియో ఉంది కానీ కాపీరైట్స్ వల్ల అనుకుంటా ఇండియా లో బ్యాన్ అయింది. మీరు ఇతర దేశాల్లో ఉంటే అది ఇక్కడ చూడవచ్చు. 

 
చిత్రం : రైడ్ (2009)
సంగీతం : కె.వి.మహదేవన్
రీమిక్స్ : హేమచంద్ర 
సాహిత్యం : సినారె 
గానం : టిప్పు, సైంధవి 

ఇక ఒరిజినల్ ప్రత్యేకత ఒరిజినల్ దే కదా ఎప్పుడూ.. ఆనాటి ఈ సూపర్ హిట్ సాంగ్ ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మంగమ్మగారి మనవడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

చాటల్ల బియ్యం దంచకపొద్దు
తెత్తున గైరమ్మ నీ సేవకూ
ఆహూ..ఆహూ..ఆహూ..ఆహూ..
చాటల్ల సజ్జలు చెయ్ వొక్క పొద్దు
తెత్తున బైరమ్మ నీ సేవకూ
ఆహూ..ఆహూ..ఆహూ..ఆహూ..
చిటికెన ఏలంత సిన్నారి మొగుడూ
సిట్టెమ్మకోలమ్మ పుట్టెడు సిగ్గు.. 
ఆహూ..ఆహూ..ఆహూ..ఆహూ..

దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా
హ... హ.... హహ... హ... హ
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు 
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ.. ఆపకుండ...
అందకుండ... కందకుండ...
దంచవే మేనత్త కూతురా 
వడ్లు దంచవే నా గుండెలదరా

పోటు మీద పోటు వెయ్యి 
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు 
కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి 
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు 
కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి 
మరి ఏ చెయ్యి దించితేమి
హ... ఏ చెయ్యి ఎత్తితేమి 
మరి ఏ చెయ్యి దించితేమి
అహహహహ...
కొట్టినా నువ్వే... పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే

హా.. దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
హా హా హాహాహాహా
దంచుతా మంగమ్మ మనవడా.. హోయ్
నేను దంచితే నీ గుండె దడ దడ

కోరమీసం దువ్వబోకు 
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు 
ఇరుగు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు 
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు 
ఇరుగు చూస్తే టముకు టముకు
ఏ కంట పడితేమి 
ఎవ్వరేమంటే మనకేమి
ఏ కంట పడితేమి 
ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే
నిన్ను కట్టుకునే హక్కున్న 
పట్టాదారుణ్ణి నేను

దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నా గుండెలదరదరదర
హా.. దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ
హా.. హా.. హా.. హా.. హాహాహాహా
హా.. హా.. హా.. హా.. హాహాహాహా 


2 comments:

బాలయ్య, సుహాసిని అదర గొట్టేశారు..

హహహహ సుహాసినికి ఈ మాత్రం మాస్ సాంగ్స్ ఇంకేం లేవేమో కదండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.