యమదొంగ చిత్రం కోసం "యమగోల" చిత్రంలోని సూపర్ హిట్ మాస్ సాంగ్ ఓలమ్మీ తిక్కరేగిందా రీమిక్స్ చేశారు. ఒరిజినల్ ట్యూన్ అండ్ పల్లవి మాత్రం తీస్కుని సాహిత్యాన్ని మార్చేసిన ఈ పాటను ఇందులో నర్తించిన తారక్(జూ.ఎన్టీఆర్), మమతా మోహన్ దాస్ పాడడం విశేషం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : యమదొంగ (2007)
సంగీతం : చక్రవర్తి
రీమిక్స్ : కీరవాణి
సాహిత్యం : భువనచంద్ర/వేటూరి(ఒరిజినల్)
గానం : తారక్, మమతా మోహన్ దాస్
అబ్బయా
ఆ...
అబ్బయా
ఏంటే
లవ్వలక
ఆ
పిల్లపిచ్చిపిచ్చి
పిచ్చా
ఊహూ కిక్కిరి
ఓయ్
కులుకులొ లవ్వలబ
ఎంభాషిది
జింజికా
ఏమయింది నీకు
ఊఊ
ఏంకావాలెహే
కస్కస లపచక చపక్కు చికిచ
బప్పర తపతప తపాంగు జంబ
జుంచక రసతప రసరస లపుట
భంచిక తుమతుమ హుళక్కి తెలుసా
చికి చికి చం కిచం కిచంచం
ఓలమ్మి తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మి తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి
పిచ్చిపట్టి పక్కకొచ్చి
ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బి తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి
ఒక్కసారె రెచ్చిపోయి
పక్కదారే పట్టిపొమ్మందా
ఓలమ్మి తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
చువ్వ నడుమే
దువ్వుతుంటే జివ్వుమంటుందా
చెయ్యవేస్తే పోటుదనమే
పొంగి పోతుందా
ఎగ దోసే యావే ఉందా
ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా
బరిలోకీ దూకేదుందా
కొండనైనా పిండిచేసే
కోడె గాడి చేతచిక్కి
గుమ్మ పాప గుండె జారిందా
ఓలమ్మి తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
అద్ది
అబ్బో
యమా
యమా యమా
యమా
యమా యమా
ఎస్సెయి
ప్రభూ లైటూ లైటు అబ్బా దీపశిఖండీ బాబు
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
దగదగదగ దీపముంటే
రాజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకులన్నీ నీకు చూపొద్దా
మరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా
అహ ఆ ఓహొ ఓ
అట్టాగైనా ఇట్టాగైనా
తేల్చుకుందాందా
కాటుకలాంటి చీకటి
దుప్పటి కప్పుకుందాందా
కాలికేస్తే వేలికేసి
వేలికేస్తే కాలికేసి
గోల చేస్తే హాయిగా ఉందా
ఓలమ్మి తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఓలమ్మి తిక్కరేగిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఓలమ్మి తిక్కరేగిందా
~*~*~*~*~*~*~*~*~*~*~
యమగోల చిత్రంలోని ఈ పాట ఒరిజినల్ వర్షన్ ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : యమగోల (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
ఓలమ్మీ తిక్కరేగిందా..
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్కరేగిందా..
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి..
పైరగాలి పైటదీసి
పందిరేసి.. చిందులేసిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి
పిల్లగాలి చిచ్చురేపి
రెచ్చగొట్టిందా
కొత్త పిచ్చి పట్టిందా
ఓలమ్మీ తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూర తక్కువ చీర నీకు నిలువనంటుందా
బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా
ముట్టుకుంటే ముద్దులై
నే పట్టుకుంటే జారిపోయే
సిగ్గువలపు మొగ్గలేసిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
రంగు దేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు దువ్విందా
కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్టపగలే చుక్కపొడిచి పంటచేను గట్టుమీద
బంతిపూల పక్కవేసిందా..
ఓలమ్మీ తిక్కరేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు?
చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు?
వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
ఆరుబయట అందమంతా ఆరబోసి కస్సుమంటూ
కన్నెమోజు కట్టుతప్పిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
6 comments:
తాతగారు..మనవడూ ఇద్దరూ ఇద్దరే..
హహహ అంతేకదండీ :-) థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
thatha brand manavadiki antinchalani chesina prayathnam
ee pata chesetappatiki NTR experience 30 years and he was the number 1 star
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్.
“ రంగు దేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు దువ్విందా
కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్టపగలే చుక్కపొడిచి పంటచేను గట్టుమీద
బంతిపూల పక్కవేసిందా..”
వేటూరి గొప్పతనం - ఈ పాటలో ఏమి రాసినా ప్రేక్షకుడికి పేద్ద పట్టింపు ఉండదు. ప్రేక్షకుడు తెరమీద తతంగం చూట్టంలో బిజి.
ఇక్కడ కూడా భావం సాహిత్యం జొప్పించాడు మహానుభావుడు
హీరోని కోడెతో పోల్చుతూ - అద్భుతం.
నీకు గుర్తుందా సోదరా రెండేళ్ళు వయసొచ్చేపటికి మీద చేయేస్తే కొమ్ము విసురుతుంది కోడె.
నా స్నేహితుడి నాన్న గారు ఒక కొడెని కొన్నారు, అప్పట్లో. అది కొత్తలో భలే ముద్దుగా ఉండి వెంట పడేది రుద్దమని. కొమ్ములు కొంచెం బయటకు వచ్చినై - అంతే కుమ్మటానికికొచ్చేది
హహహహ అవును సోదరా.. అదే వేటూరి గారి ప్రత్యేకత.
చాలా బాగా గుర్తుంది.. మంచి విషయం పంచుకున్నారు. నా చిన్నప్పుడైతే భయపడిపోయేవాడ్ని ఒకటి రెండు సార్లు పడిపోయినట్లు కూడా గుర్తు. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సోదరా..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.