సోమవారం, జులై 27, 2020

నరుడి బ్రతుకు నటన...

శుభసంకల్పం సినిమాలోని ఒక హృద్యమైన సన్నివేశం కోసం ’సాగరసంగమం’ లోని "తకిటతధిమి" పాటలోని నరుడి బ్రతుకు నటన అనే చరణాన్ని పల్లవిగా వాడుకుని రీమిక్స్ చేశారు. ఆ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శుభసంకల్పం (1995)
సంగీతం : ఇళయరాజా
రీమిక్స్ : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు   

నరుడి బ్రతుకు నటన 
ఈశ్వరుడి తలపు ఘటన 
ఆ రెంటి నట్ట నడుమ 
నీకెందుకింత తపన 

నరుడి బ్రతుకు నటన 
ఈశ్వరుడి తలపు ఘటన 
ఆ రెంటి నట్ట నడుమ 
నీకెందుకింత తపన... 

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా 
తెలిసీ తెలియని ఆశల వయాసీ వరసా... 
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా.ఆ . 
తెలిసీ తెలియని ఆశల వయాసీ వరసా 
యేటిలోని అలలవంటి 
కంటిలోని కలలు కదిపి 
గుండియెలను అందియలుగ చేసీ 

తకిట తదిమి తకిట తదిమి తందాన 
హృదయలయల జతుల గతుల తిల్లాన 
తడబడు అడుగుల తప్పని తాళాన 
తడిసిన పెదవుల రేగిన రాగాన 
శృతిని లయని ఒకటి చేసి 

తకిట తదిమి తకిట తదిమి తందాన 
హృదయలయల జతుల గతుల తిల్లాన 

కంటి పాపకు నేను లాల పోసే వేళ 
చంటి పాపా..ఆఆఆఅ...
చంటి పాప నీకు లాలినౌతానంది 
ఉత్తరాన చుక్క ఉలికి పడతా ఉంటే 
చుక్కానిగా నాకు చూపు అవుతానంది 
గుండెలో రంపాలు కోత పెడతా ఉంటే 
పాత పాటలు మళ్ళీ పాడుకుందామంది 

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు 
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు 

అన్నదేదో అంది ఉన్నదేదో ఉంది 
తలపై నా గంగ తలపులో పొంగింది 
ఆ .ఆ.ఆ ఆఆ ఆఅ ఆఆ 
ఆది విష్ణు పాదమంటి ఆకశాన ముగ్గు పెట్టి 
జంగమయ్య జంట కట్టి కాశిలోన కాలు పెట్టి 
కడలి గుడి కి కదలి పోయే గంగా 

తకిట తదిమి తకిట తదిమి తందాన 
హృదయలయల జతుల గతుల తిల్లాన 
తకిట తదిమి తకిట తదిమి తందాన 
హృదయలయల జతుల గతుల తిల్లాన

ఇక ఈ పాట ఒరిజినల్ వర్షన్ ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : సాగరసంగమం (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత త పన ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల వయసీ వరసా ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల లలలా లలలా
ఏటిలోని అలల వంటి కంటిలోని
కలలు కదిపి గుండియలను
అందియలుగ చేసి ॥
తడబడు అడుగుల తప్పని తరిగి
డదోం తరిగిడదోం తరిగిడదోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ...
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే
సుస్వరాల గోపురం ॥
అలరులు కురియగనాడెనదే
అలకల కులుకుల అలమేల్మంగా॥
అన్న అన్నమయ్య మాట
అచ్చ తేనె తెనుగుపాట
పల్లవించు పద కవితలు పాడీ...

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥ 

 

4 comments:

బహుశా ఈ పాటలో పదాలు విశ్వనాధ్ గారికి చాలా ఇష్టమేమో..అందుకే శుభసంకల్పం లో మళ్ళీ చూపించారేమో అనిపించింది..

అవునండీ.. ఆ సన్నివేశానికి కూడా సరిగ్గా సరిపోతాయ్ ఆ లైన్లు అందుకే తీసుంటారు. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

ee song sri s p b ki " narudibrathuku natana, eeswarudi thalapu ghatana" ane padaalu ishtam, anduke thanu theesina subhasankalpam chithram lo aa padaalatho rayamani adigityhe vraasina paata,

ఈ సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.