కొండవీటి రాజా సినిమాలో సూపర్ హిట్ అయిన "మంచమేసి దుప్పటేసి" పాటను సీమశాస్త్రి సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఆ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సీమశాస్త్రి (2007)
సంగీతం : చక్రవర్తి
రీమిక్స్ : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : వేటూరి
గానం : జెస్సీగిఫ్ట్స్, కల్పన
ఇక రాఘవేంద్రరావ్ చిత్రీకరణలో చిరు విజయశాంతి స్టెప్స్ తో చక్రవర్తి బీట్ తో అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించిన కొండవీటి రాజా సినిమాలోని ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కొండవీటి రాజా (1986)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
తననం తననం తననం తననం
తననం తననం తా
తననం తననం తననం తననం
తననం తననం తా
మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను
రారా రారా.. తనన తననం
చిన్నచీర కట్టాను సన్నజాజు లెట్టాను
రారా రారా.. తనన తననం
దిండు ఎంత మెత్తనో మంచ మెంత గట్టిదో
చుక్కలోంక చూసుకుంటూ
లెక్కబెట్టుకుందాము రారా
ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను
రావే రావే... తనన తననం...
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను
రావే రావే... తనన తననం
పండు ఎంత తీయనో పాలు ఎంత చిక్కనో
సోకులోంక చూసుకుంటూ
సొమ్మసిల్లిపోదాము రావే
నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది
తనన తననం..
నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది
తనన తననం...
కౌగిలింత కోరలేక అలిసిపోతిని
రాతిరంత కునుకులేక రగిలిపోతిని
కసి కసి ఈడు కమ్ముకొస్తే
కంటిని రెప్పే కాటు వేస్తే
ఎట్టా ఆగను చలిలో విరులు
ఎట్టా అడగను అసలు కొసరు
సాగాలి ... నీ జోరు
ఆకలేసి దప్పికేసి
అన్నమంటూ వచ్చాను రావే రావే
మంచమేసి దుప్పటేసి
మల్లెపూలు జల్లాను రారా రారా
తననం తననం తననం తననం
తననం తననం తా
తననం తననం తననం తననం
తననం తననం తా
పెరుగుతున్న సోకుమీద మీగడున్నది
తనన తననం..
పెదవి తాకి ముద్దులాగ మారుతున్నది
తనన తననం..
చీకటింట చిట్టిగుండె కొట్టుకున్నది
వాలుకంట వలపుమంట అంటుకున్నది
జళ్ళో పువ్వు జావళి పాడే
ఒళ్ళో ఒళ్ళో ఒత్తిడి సాగే
ఎంత తీరినా ఎదలో సొదలే
వింతవింతగా జరిగే కతలే
మోగాలీ తొలితాళం
మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను
రారా రారా.. తనన తననం..
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను
రావే రావే.. తనన తననం..
దిండు ఎంత మెత్తనో మంచమెంత గట్టిదో
సోకులొంక చూసుకుంటూ
సొమ్మసిల్లిపోదాము రావే
తననం తననం తననం తననం
తననం తననం తా
తననం తననం తననం తననం
తననం తననం తా
6 comments:
ఫక్తు కమర్షియల్ శృంగారంలో కూడా వేటూరి మెరిపించే సాహిత్యం - అద్భుతం సోదరా.
అవును సోదరా.. నో డౌట్ అబౌట్ దట్.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
చిరంజీవిగారిని చూసిన కళ్ళతో....
హహహ నో కామెంట్స్ అండీ :-) థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
ee hero chethilo padda maro chiranjeevi paata
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.