బుధవారం, జులై 15, 2020

ఆరేసుకో బోయి...

ఎన్ టీ ఆర్ నటించిన అడవిరాముడు చిత్రంలోని "ఆరేసుకోబోయి" పాటను ప్రభాస్ అడవిరాముడు సినిమాకోసం  మణిశర్మ రీమిక్స్ చేశారు. సంగీత సాహిత్యాలను పెద్దగా మార్చని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అడవి రాముడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
రీమిక్స్ : మణిశర్మ 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సంధ్య  

ఇక అన్నగారు జయప్రద తో కలిసి స్టెప్పులేసి అప్పటి యువతరాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ సూపర్ హిట్ ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అడవి రాముడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు,  సుశీల

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె అరె అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..ఈ.. ఈ...
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి..స్స్..
చలి చలి ఆఁహ్... చలి చలి


పారేసుకోవాలనారేసుకున్నావు..
అరె అరె అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. ఈ.. ఈ..
నాకు ఉడుకెత్తి పోతోంది.. హరి హరి..
హరి హరి.. హరి హరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను..

అరె అరె అరె అరె అరె అరె

నాలోని అందాలు నీ కన్నుల
ఆరేసుకోనీ సందెవేళ

నా పాట ఈ పూట నీ పైటల
దాచేసుకోనీ తొలిపొంగుల
ఆఆఆ నాలోని అందాలు నీ కన్నుల
ఆరేసుకోనీ సందెవేళ

ఏయ్...నా పాట ఈ పూట నీ పైటల
దాచేసుకోనీ తొలిపొంగుల
నీ చూపు సోకాలి...
నా ఊపిరాడాలి...
హా.. నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలి మంట కావాలి 

నీ వింత కౌవ్వింతకే.. కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..

నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి
హరి హరి..ఏయ్... హరి హరి

నీ ఒంపులో సొంపులే హరివిల్లు..
నీ చూపులో రాపులే విరిజల్లు
ఆఁ... నీ రాక నా వలపు ఏరువాక..
నిను తాక నీలిమబ్బు నా కోక...

నే రేగిపోవాలి
నేనూగిపోవాలి 

నే రేగిపోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి..

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె.. ఆఁ అరె ఆఁ అరె ఆఁ అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి..స్స్ హా..
చలి చలి..స్స్ హా.. చలి చలి


పారేసుకోవాలనారేసుకున్నావు
అరె..ఆ.. అరె..ఆ.. అరె..ఆ.. అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెత్తి పోతోంది..
హరి హరి.. హరి హరి.. హరి హరి

లాలాల లాలాలలలలలలల..
లాలాల లాలాలలలలలలల.. 


2 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ప్రభాస్ ఫాన్స్..ఈ పాట యెవరు యెటెంప్ట్ చేసినా..సాహసమే..

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.