వర్మ స్టైల్లో మణిరత్నం తీసిన సినిమా “దొంగ దొంగ” అనిపిస్తుంటుంది నాకు. అప్పట్లో ఈ సినిమాకి వర్మ కూడా పని చేశారన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. సి.బి.ఐ ఆఫీసర్ గా బాలు గారి నటన చాలా పెక్యూలియర్ గా ఉంటుంది. సినిమా చూసివచ్చి మా ఫ్రెండ్స్ అందరికి బాగుందని చెప్తే సినిమానేమో ఫ్లాపు, అంతేకాక చాలా మంది ఇతర ఫ్రెండ్స్ కి నచ్చలేదని ఆ తర్వాత మా అభిప్రాయం అడగడమే మానేశారు :-)
రెహమాన్ సంగీతం మాత్రం అప్పట్లో ఉర్రూతలూగించింది, దీనిలో ఈ కొత్తబంగారులోకం పాట కొంచెం ఎక్కువరోజులు వినిపించిన పాట, సాహిత్యం కూడా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : దొంగ దొంగ
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఏ.ఆర్.రహమాన్
గానం : మనో, చిత్ర
కొత్త బంగారు లోకం..
మాకు కావాలి సొంతం..
గాలి పాడాలి గీతం..
పుడమి కావాలి స్వర్గం..
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నల్లలోనే వెయ్యికలలు పండాలి మాకూ..
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చీ
పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగి పోవాలీ..
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను ఉండని
మమతనే ప్రతి మనసులొ కొలువుండని
మనుగడే ఒక పండగై కొనసాగని
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
ఓడిపోవాలి స్వార్దం ఇల మరిచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవులె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోని అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతినిత్యం
వేదనే ఇక తొలగనీ.. వేడుకే ఇక వెలగనీ..
ఎల్లల పోరాటమే ఇక వీడనీ
ఎల్లరు సుఖశాంతితో ఇక బ్రతకని
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం
2 comments:
నిజమే..అలాంటి లోకమే సొంతమైతే..ఇప్పుడు స్టేట్ వున్న పరిస్తితుల్లో అది సాధ్యమంటారా..ఆన్ లైటర్ నోట్..ఇందులో తీ..తీ..తీయనీ..సాంగ్ కూడా చాలా బావుంటుంది వేణూజీ..
థాంక్స్ శాంతిగారు.. అమ్మో రాజకీయాలు నా వంటికి పడవండీ.. ఆ ఒక్కటీ అడక్కండి :-) అవునండీ ఆపాటకూడా బాగుంటుంది.. త్వరలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.