శనివారం, డిసెంబర్ 14, 2013

ఓ నటన మయూరీ వయ్యారీ..

అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపిన చిత్రం ప్లస్ ఆడియో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఈ టిక్.టిక్.టిక్ సినిమా. నా చిన్నతనంలో అమ్మవాళ్ళు ఇంటిపక్క కుర్రాళూ ఈ సినిమా కబుర్లు చెప్పుకోవడం నాకు బాగా గుర్తు ఇక ఈ పాటైతే రేడియోలో లెక్కలేనన్ని సార్లు విన్నాను. ఇప్పటికీ నా ఫేవరెట్ ప్లేలిస్ట్ లో ఉంటుంది ఈ పాట. బాలు జానకి ల గళం ఆత్రేయ గారి సాహిత్యం ఇళయరాజా గారి సంగీతం గురించి ఇక చెప్పేదేముంది.


ఈ పాట ఇక్కడ వినండి. ఎంబెడ్ చేసిన యూ ట్యూబ్ వీడియో తెలుగు ఆడియోతో చేసిన స్లైడ్ షోది. వీడియో సాంగ్ చూడాలనిపిస్తే తమిళ్ వర్షన్ యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే కావాలంటే పై డివ్ షేర్ ఫైల్ లో వినండి. మొదటలో వచ్చే జతులు నాకు తెలిసినంతవరకూ కరెక్ట్ గా టైప్ చేయడానికి ప్రయత్నించాను సవరణలు ఉంటే కామెంట్స్ లో తెలియజేయగలరు.చిత్రం : టిక్.టిక్.టిక్ (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

తకజంతకజంతరిత..
తకతరికిటతం..తరికిటజం తరిత..
తకతరికిటజం..తజంతరి తరికిటజం..
తరికిటతం..తకతిరికిటతం..
తకదికుతరికిటతం త..

తాక్కు తజంతరిత
తకతరికిటతం..తరికిటజం తరిత..
తకతరికిటతం.. తాక్కుతజంతరి.. తరికిటజంతరి..
తక తరికిట తోం.. తక తరికిట తోం..
తకదికుతరికిటతోం త..

తత్తరి తజ్జణు తద్ధిమితా..
తకధిమి తజ్జణు తకధిమితా..
తఝ్ఝరి కిటతక తరికిట తోం..
తఝ్ఝెణు కిటతక తరికిట తోం..
తకఝ్ఝెణు కిటతక తరికిట తోం..
తధీం గిణతోం.. తధీం గిణతోం.. తధీం గిణతొం. తా..
తద్దిత్తా..తకఝణుతా
తాదిత్తా.. తకఝణుతా
తాం తకఝణుతం..తకజణుతం...తనతం..
తాం తరికిట తాం తరికిట తాం తరికిట
తాం తరికిట తాం తరికిట తాం

ఓ నటనమయూరీ వయ్యారీ
ఓ నటనమయూరీ వయ్యారీ
నడయాడే నీ పాదం శ్రీ పాదం
నడయాడే నీ పాదం శ్రీ పాదం
నడకలు కులుకులే నీ నాట్యం
సగరిగ మపదని స
ఓ సిరి సిరి మువ్వల చిన్నారీ
I love you I love you I love you
I love you I love you I love you
అభినయం అనునయం నీ అందం
సగరిగ మపదని స

నీ చిలిపి కోపం నా వలపు దీపం
నీ నటన వేగం నా నయన రాగం
అదో ముద్దు అదో మత్తు నీకు
అదే నువ్వు అదే నవ్వు నాకు
ఇదే అగ్ని ఇదే జ్వాల నాకు
ఇదే లీల ఇదే హేల నీకు
వెలయితిని నేను నిదురకు
బలయితిని నీదు సొగసుకు
నీ గడపకు తోరణముగ నేనుండిన చాలంటిని
సనిదప మపదని
నా అడుగుల మడుగుల చెలికాడా

నన్నాన నననాననాన నన్నాన నననాననన
నన్నాన నననాననాన నన్నాన నననాననన 

నీ పెదవి పైనా నా ప్రేమ రచన
నీ మనసులోనా నా మమత వాన
ఒకే కోవెలొకే దేవి నాకు
ఒకే పూవు ఒకే పూజ నీకు
ఒకే జపము ఒకే తపము నీకు
ఒకే వరము ఒకే యుగము నాకు
తపించితి నిన్ను పొందక
వరించితి నీకు అందక
నా హృదయము నా జన్మము
నీ పరమని నీ వశమని
సనిదప మపదని

ఓ నటనమయూరీ వయ్యారీ
I love you I love you I love you
I love you I love you I love you
నడకలు కులుకులే నీ నాట్యం
సగరిగ మపదని 
ఓ నటనమయూరీ వయ్యారీ

4 comments:

కెవ్వ్వ్వ్వ్..మీ బ్లాగ్ ఓ ఎడిక్షన్ ఐపోతోంది వేణూజీ..పాట వినగానే గుండె టైం మిషన్ లోకి వెళ్ళి పోయిందండీ..థాంక్యూ..

థాంక్స్ శాంతి గారు :-) ఇలా పాటలు వింటూ టైంమిషన్ లోకి వెళ్ళే అలవాటు మీక్కూడా ఉందాండీ :-))

చిన్నప్పుడు ఎక్కువగా రేడియో వినేవాళ్ళం .మల్ల చాలా రోజులకి ఇప్పుడు.థాంక్సండి :)రాధిక (నాని)

థాంక్స్ రాధిక గారు.. అవునండీ నాక్కూడా ఈపాట రేడియోలోనే పరిచయం :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.