సోమవారం, డిసెంబర్ 30, 2013

నువ్వు వస్తావనీ బృందావని

చక్రవర్తి గారి ఆణిముత్యాలలో మల్లెపువ్వు ఒక మరుపురాని ఆల్బం, ఇందులో ఎన్నో మంచి పాటలున్నాయి వాటిలో ఈ పాట ఒకటి. సాహిత్యం ఆరుద్ర గారా వేటూరి గారా అనే ఓ చిరు సందేహం ఉంది తెలిసినవారెవరైనా కామెంట్స్ లో చెప్పగలరు. ఈ మధురగీతం మీకోసం.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
గానం : వాణీ జయరాం
రచన : ఆరుద్ర/వేటూరి

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..
వేణువు విందామని.. నీతో వుందామని..
నీ రాధ వేచేనయ్యా రావయ్యా..
ఓ..ఓ..ఓ..గిరిధర.. మురహర..
రాధా మనోహరా..ఆఆ..ఆఆ..ఆఆ.

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. 
క్రిష్ణయ్యా.. రావయ్యా..

నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా..
మమతల దీపాలు వెలిగించాను 
మమతల దీపాలు వెలిగించాను 
కుశలము అడగాలని.. పదములు కడగాలని..
కన్నీటి కెరటాలు తరలించాను..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
గిరిధర.. మురహర.. నా హృదయేశ్వరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా 
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..
వేణువు విందామని.. నీతో వుందామని..
నీ రాధ వేచేనయ్యా రావయ్యా..ఓ..కృష్ణయ్యా..

 
నీ పద రేణువునైనా.. పెదవుల వేణువునైనా..
బ్రతుకే ధన్యమని భావించానూ..
బ్రతుకే ధన్యమని భావించానూ....
నిన్నే చేరాలని.. నీలో కరగాలని..
నా మనసే హారతి గా వెలిగించాను
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
గిరిధర.. మురహర.. నా హృదయేశ్వరా
ఒకసారి దయచేసి దాసిని దయచూడరా..
ఒకసారి దయచేసి దాసిని దయచూడరా..
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...

8 comments:

నా పాట ఇది.. థాంక్స్, వేణూ :-)

ప్రాసలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరుద్ర అనే అనిపిస్తోందయ్యా

బావుంటుందండీ ఈ పాట. నాకిష్టం. థాంక్స్ ఫర్ షేరింగ్.

నాకు చాలా ఇష్టం రాధిక (నాని)

అచ్చమైన మీరా భజన్ లాంటి ఈ పాట వింటుంటే..మనసు ఆర్ద్రమౌతుంది..కలల కాంక్ష కంటి చివరి కన్నీటి ముత్యమౌతుంది..గుండె దాటిన పిలుపు పెదవి చివరి పగడమౌతుంది..అందించిన మీకెన్ని ధాంక్స్ చెప్పినా తక్కువే వేణూజీ..

హహహ అవునా నిషీ థాంక్స్ :-)
థాంక్స్ పప్పుసార్ కరెక్టేనేమోనండి.
థాంక్స్ శిశిర గారు.
థాంక్స్ రాధిక గారు.
పాట విని మీరంతా ఆస్వాదిస్తే నాకదేచాలు శాంతి గారు, పాటగురించి అంత అందంగా చెప్పినందుకు థాంక్స్ :-)

మల్లెపువ్వు సినిమాకి వీటూరి (వేటూరి కాదు) రాసిన పాట ఇది. 1970లో పుష్పాంజలి అనే హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాకు లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకులు.ఆనంద్ బక్షి రాసిన ఒక పాటను మన్నాడే, లతా మంగేష్కర్ ఆలపించారు. " శామ్ డలే జమునా కినారే కినారే ఆజా రాధే ఆజా తోహే శామ్ పుకారే" అనేది ఆ పాట. ఈ పాటనే ప్రేరణగా తీసుకొని చక్రవర్తి వాణీ జయరాం చేత మల్లెపువ్వు లో ఈ పాట పాడించారు.

థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ షన్ముఖ చారి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.