సోమవారం, డిసెంబర్ 09, 2013

అందమైన నా ఊహల మేడకు

రాజశేఖర్ కెరీర్ కు మేలిమలుపునిచ్చిన సినిమాల్లో ఒకటైన "ఆహుతి" సినిమాలోని ఈపాటను పాడుకోని కుర్రకారు బహుశా అప్పట్లో ఉండి ఉండదేమో. సత్యం గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చక్కని మెలొడీ... ఇప్పటికీ అలరిస్తుంది వింటూంటే నాస్టాల్జిక్ గా అనిపిస్తుంది. ప్రేయసిని తలచుకుంటూ తన అందాన్ని మెచ్చుకుంటూ తను పక్కన ఉంటే ఏం సాధించగలడో ఓ ప్రేమికుడు చక్కని తెలుగులో చెప్తూన్నట్లుగా సాగే ఈ పాట మల్లెమాల గారు అబ్బాయిలకి ఇచ్చిన మంచి గిఫ్ట్. ఈ అందమైన పాట మీకోసం.. ఆడియోను చిమటమ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : ఆహుతి (1988)
సంగీతం : సత్యం
సాహిత్యం : యం. యస్. రెడ్డి(మల్లెమాల)
గానం : బాలు

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం

మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా
నా చెలి ముసి ముసి నవ్వులు అందం...
ఆ... నెమలి హొయలకన్నా...
సెలయేటి లయల కన్నా...
నా చెలి జిలిబిలి నడకలు అందం
అపురూపం ఆ నవ లావణ్యం...
అపురూపం ఆ నవ లావణ్యం
అది నా మదిలో చెదరని స్వప్నం...

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం

పైడిబొమ్మ లాంటి ఆమె పక్కనుంటె
పగలే వెన్నెల నే కురిపిస్తా...
ఆ... నీడ లాగ నాతో...
ఏడడుగులు సాగితే...
ఇలలో స్వర్గం నే సృష్టిస్తా...
రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ..
రస రమ్యం ఆ రాగ విలాసం
వసి వాడదు అది ఆజన్మాంతం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం

7 comments:

వేణూజీ..లిరికల్ గా బానే వున్నా, మ్యూజికల్ గా చాలా మామూలు పాట కదండీ ఇది..ఇంకెవరి బ్లాగ్ లో నైనా ఐతే ఓకె..కానీ పాటకి చిరునామా లాంటి మీ బ్లాగ్ లో..మీ పై అంత హై ఎక్స్పెక్టేషన్ కి కారణం మీరే సుమండీ..

థాంక్స్ శాంతిగారూ.. నాకు లిరిక్స్ తో పాటు ట్యూన్ కూడా బాగా ఇష్టమండి. పాటకు చిరునామా నా బ్లాగ్ అనడం కేవలం మీ అభిమానమండీ.. ఇంకా ఎన్నో మంచి బ్లాగ్స్ ఉన్నాయి పాటల గురించి.

Nice song. Hope to see a post on "nenena aa nenena" song by Sirivennela garu from Anthaku mundu aa tarvatha.

Siddharth

ఆల్రెడీ పోస్ట్ చేశాను సిద్దార్థ్ గారు.. ఇక్కడ చూడండి..
http://sarigamalagalagalalu.blogspot.in/2013/09/blog-post.html

Venu garu,

ee pata naku kuda bhale istam andi. manchi patani post chesaru.

"అంకుశం" తర్వాత వచ్చిన "ఆహుతి"

Aahuti (1987 or 88) mundu vachindi kada Ankusam (1989) kanna??

indulo Rajasekhar, Jeevita characters kuda bhale design chesaru. appatlo vastunna movies kante konchem hatke...

థాంక్స్ మహెక్ గారు..
ఓహ్ నాకు ఈ రెండు సిన్మాల విషయంలో చిన్న కన్ఫూజన్ అండీ.. బ్లాగ్ పోస్ట్ సరి చేశాను. అవునండీ హీరో హీరోయిన్స్ కారెక్టరైజేషన్ నాకు కూడా ఇష్టం :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.