నేను పుట్టకముందు రిలీజైన ఈ సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి నాకు అస్సలు తెలియదు కానీ ఈ పాట కూడా నేను రేడియోకి అతుక్కుపోవడానికి గల ముఖ్య కారణాలలో ఒకటి.. వివిధభారతిలో తరచుగా వినిపించే ఈ పాట ఈరోజు వింటూన్నాకూడా ఆరుబయట నులకమంచం పై పడుకుని రేడియోని గుండెలమీద పెట్టుకుని స్పీకర్ లో మొహం పెట్టేసి మరీ వింటున్న అనుభూతే కలిగింది నాకు. ఇక ఇందులో ఎమ్మెస్వీ సంగీతమా రాజశ్రీ సాహిత్యమా బాలూ సుశీలల స్వరమా ఏది బాగుందో చెప్పడం ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చినా చెప్పడం అసాధ్యమని నా అనుకోలు. ఈ అద్భుతమైన పాట మీరూ వినండి. ఆడియో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : గౌరవం (1970)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాధన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, పి.సుశీల
యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా..ఆఆఅ.అ..
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నీది కదా..
హృదయం తెలుపు ఊహలలో..
రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన
ఊరెను నా మనసులో..
యమునా తీరాన ఆహాహాఆఆ అహహఆఅ
రాధ మదిలోన ఆహాహాఆఆ అహహఆఅ
కృష్ణుని ప్రేమ కథా...ఆఆఆ.. ఆహాహాఆఆ అహహఆ
కొసరి పాడేటి కోరి వలచేటి ఆఆ
మనసు నాది కదా.. ఆఆ
ఎదలో తలపే తొణికెనులే
అధరం మధురం చిలికెనులే
రాధా హృదయం మాధవ నిలయం
మాయనిదీచరితమే
మనసే నేడు వెనుకాడే
హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొలిగేనే
ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం..
ఆ దినమే పండుగ
యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా..ఆఆఆ..
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నాది కదా..
లా..లాలలాలలలా..
2 comments:
లిరిక్స్ చూసినపుదు యేదో తెలీని పాట అనిపించిందండీ..బట్ విన్న వెంటనే హెలో నన్ను మర్చిపోతే యెలా అని చిన్న నాటి విన్న ఙ్యాపకం ప్రేమ గా పలుకరించింది..ముఖ్యంగా మీరు యెన్నుకున్న రాధా,మాధవుల పిక్ చాలా, చలా బావుంది వేణూజీ..మల్లె చెండులా మాధవుని వొడిలో వొదిగి పోయిన రాధమ్మ మీంచి చూపు తిప్పు కోవడం చాలా కష్టమైందంటే నమ్మండి..
థాంక్స్ శాంతిగారు. ఫోటో కూడా నచ్చినందుకు సంతోషం .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.