ఆదివారం, డిసెంబర్ 15, 2013

పొద్దున్నే పుట్టిందీ చందమామ

రాజ్-కోటి సంగీతంలో అపుడపుడు ఆకట్టుకునే మెలోడీలు కూడా తగుల్తుంటాయి. అలాంటి ఓ మెలొడీ ఏ ఈపాట, మీరూ చూసి విని ఆనందించండి ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : శత్రువు
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

పొద్దున్నే పుట్టిందీ చందమామ..
మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావా దీపికా.. హోయ్
స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మ
ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్ట చెప్పమ్మ
మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో
ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికి

ముందూ మునుపు లేని ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో
ముద్దూ మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని
ఈ కొంటే చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి

పొద్దున్నే పుట్టిందీ చందమామ
మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మ

నీ కోసం పుట్టాను..నిలువెల్లా పూశాను గుండెల్లో గూడే కట్టాను
నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు కట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను
నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్లు వేయాలా సింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి
కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో
పగలేదో రేయేదో తెలియదు లేవయ్యో

పొద్దున్నే పుట్టింది చందమామ 
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావా దీపికా.. హోయ్
స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో

10 comments:

థాంక్స్ వేణు జీ , నా ఫేవరేట్ సాంగ్ :)

బావుంటుందండీ ఈ పాట.. చిన్నప్పటి పాట. :)

నాకూ ఇష్టమైన పాటే :)వేణు గారు ,ఈ రోజు ఏం పాట పెడతారు ? అని చూసేలా చేస్తున్నారు :))రాధిక (నాని)

వంశీ, కార్తీక్ గారు, శిశిర గారు, రాధిక గారు ధన్యవాదాలు :-)

పాటే కాదు,ఈ మూవి కూడా బావుంటుంది వేణూజీ..ముఖ్యంగా ఇందులోని "వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తినే"..పాట తో బోలెడు మధుర స్మృతులున్నాయండీ..ఇంతకీ నే చెప్పొచ్చే దేవిటంటే..అమ్మ చేతి కాఫి, కాఫి బైట్ టాఫి, వేణూజీ పాటల బర్ఫి-వెరీ, వెరీ యమ్మీ అండ్ టేస్టీ..

థాంక్స్ శాంతిగారూ.. హహహ వెయ్యిన్నొక్కజిల్లాల వరకూ కూడా త్వరలో వస్తుందండీ ఈ బ్లాగ్ లో మరి అపుడైనా మీజ్ఞాపకాలను పంచుకోండి :-) నిజమేనండీ ఈ సినిమాకూడా బాగుంటుంది. మీరు చెప్పినవాటిలో మొదటి రెండూ కరెక్టే కానీ మూడో విషయమే మీరు అపుడే డిసైడ్ అయిపోకండి :-)

"వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తినే"
This song is from Surya IPS, not from Shatruvu, FYI

$iddharth

థాంక్స్ సిద్దార్థ్ గారు.. నాకు ఈ రెండు సినిమాల విషయంలోనూ ఎప్పుడూ చిన్న కన్ఫూజన్ ఉంటుందండీ పైగా సేం కాంబినేషన్లో రెండూ ఒకేఏడాది విడుదలైన సినిమాలనుకుంటాను కదా అందుకే అయుండచ్చు..

మై గాడ్ వేణూజీ నేను బ్రెయిన్ వీటా తాగ వలసిన టైం దగ్గిర పడిందనుకుంటానండి..యస్..వెయ్యినొక్క జిల్లాల" ఈజ్ ఫ్రం సూర్యా ఐ పి యస్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.