గురువారం, డిసెంబర్ 19, 2013

సా విరహే తవదీనా రాధా.

శ్రీ సూర్యనారాయణా మేలుకో అంటూ సాక్షాత్తు సూర్యభగవానుడ్నే గద్దించి నిదుర లేప గల సత్తా ఉన్న భానుమతమ్మ తొలినాళ్ళలో మధురంగా ఆలపించిన ఈ పాట వినని తెలుగు వాళ్ళు ఉంటారని నేను అనుకోను, బహుశా ఈ తరం యువతకి చేరి ఉండకపోవచ్చేమో తెలియదు. జయదేవుని అష్టపదినుండి కొన్ని పంక్తులను తీసుకుని రసాలూరు సాలూరి వారి స్వరసారధ్యంలో కూర్చిన ఈ అందమైన పాట మీకోసం.. ఆడియో మాత్రం వినాలంటే చిమటాలో ఇక్కడ వినవచ్చు. 

ఈ పాటలో ఉపయోగించిన లైన్స్ కి అర్ధం ఇదట : ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి. యమునా తీరంలో ఒక పొదరింటిలో చంచల మనస్కుడై రాధను తలుస్తున్న కృష్ణుణ్ణి సమీపించి, రాధ పడే బాధనీ, నానా అవస్థలనీ ఆమె చెలికత్తె చెప్తుంది.
"రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. నీవెప్పుడు వస్తావో అని తహతహలాడుతూ పూలపానుపుని పరిచి వుంచింది. ఆ పడకపై నిన్ను కౌగిలించుకొని ఆనందంగా పడుకోవాలని రాధ కలలు కంటున్నది. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు నీ పేరునే ఆమె జపిస్తుంది. నీ ఉదాసీనత వల్ల ఆమెను చంద్రుడు కూడా కాల్చి వేధిస్తున్నాడు."

ఈ అష్టపది పూర్తి స్క్రిప్ట్ భావంతో సహా తెలుసుకోవాలంటే ఈమాటలోని ఈ వ్యాసం చూడండి. (పై పేరా ఈ వ్యాసంనుండి సంగ్రహించబడినదే) ఈ వ్యాసంలోనే ఇదే అష్టపదిని బాలమురళీ కృష్ణ గారు, టంగుటూరి సూర్యకుమారి గారు, నిత్యసంతోషిణి ఇంకా ఎందరో ఇతర గాయనీ గాయకులు పాడగా చేసిన రికార్డింగ్స్ కూడా వినవచ్చు ఆసక్తి ఉంటే తప్పక చూడండి.


చిత్రం : విప్రనారాయణ
సాహిత్యం : జయదేవుడు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : భానుమతి

విరహే..ఏ.ఏ.ఏ.ఎ.ఎ.ఎ.ఎఎ
తవా...ఆఆఆ...ఆఆఅ....
దీనా ఆఆఆఆ....ఆఆ.ఆఅ.అ.అ.అ.అ...
సా విరహే తవదీనా రాధా..
సా విరహే తవదీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా....

నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివా..ఆఆ..ఆఆ.ఆఆ.ఆఆఆఅ
 వ్యాళనిలయ మిళనేన గరళమివా కలయతి మలయ సమీరం
సా విరహే తవ దీనా

కుసుమ విశిఖశరతల్పమనల్ప విలాస కళా కమనీయం
వ్రత మివ తవ పరి రంభసుఖాయా...
వ్రత మివ తవ పరి రంభసుఖాయా కరోతి కుసుమ శయనీయం
సా విరహే తవ దీనా

ప్రతిపద మిద మపి నిగదతి మాధవ.. నిగదతి మాధవ..
నిగదతి మాధవ తవచరణే పతితాహం....
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే.. తనుదాహం
సా విరహే తవ దీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా...
కృష్ణా...ఆఆఆఆఆఆఆఆ....
తవ విరహే..ఏఏఏ....దీనా... ఆఆఆఆఆ..ఆఅ.అ.అ.ఆఆఆ...

2 comments:

క్షేత్రయ్య పదాలలో కృష్ణ పాదాలు అల్లరిగా నర్తిస్తే..జయదేవుని అష్టపదులో కృష్ణ లీలలు రమ్య రమ్యంగా గుండెని హత్తుకుంటాయి..వేణూజీ వీలైతే "రాధికా కృష్ణా" బాలమురళీకృష్ణ గారి వెర్షన్ పోస్ట్ చేయ గలరా..

థాంక్స్ శాంతిగారు, అవునండీ అష్టపదుల గురించి చాలా బాగా చెప్పారు. తప్పకుండా రాధికకృష్ణా కలెక్ట్ చేసి ప్రచురించడానికి ప్రయత్నిస్తానండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.