మొన్న వేవేలా గోపెమ్మలా పాట గురించి మాట్లాడుకుంటూ కమల్ పై సరదాగా చిత్రీకరించిన కొన్ని మధురమైన పాటల గురించి చెప్పుకున్నాం కదా ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది, ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈపాట కూడా కృష్ణుడి మీదే కావడం. సినిమా కామెడీ సినిమా కావడంతో ఈ పాటకూడా పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా చిత్రీకరించినా పాటమాత్రం చాలా మధురంగా ఉంటుంది నాకు బాగా ఇష్టమైనపాట. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : ఒక రాధ ఇద్దరు కృష్ణులు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం
మధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి సాగే సుడిరేగే
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
హేమంత వేళల్లో లేమంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
4 comments:
మంచి పాట వేణు గారు. పాట ముందర వచ్చే జానకిగారి ఆలాపన ఈ పాటకి హైలైట్.
కమ్మగా పాడేవాళ్లు, గొప్పగా పాడేవాళ్ళు ఎంతోమంది. కానీ పాటతో, ఒక నవ్వుతో, ఒక ఆలాపనతో, ఒక నిట్టూరుపుతో...వినేవాళ్ళ గుండెలకి గాలం వేసి, ప్రాణాలు తోడేసే మాయాజాలం కేవలం జానకి గారు, బాలు గార్లు మాత్రమే చెయ్యగలరు. ఇంక ఇళయరాజా గారి గురించి, వేటూరి గారి గురించి మాట్లాడేదేముంది?
థాంక్స్ మహెక్ గారు... జానకి గారి గురించి బాలు గారి గురించి బాగా చెప్పారండీ.. ముఖ్యంగా వీరిద్దరు కలిసి పాడిన కొన్ని పాటలు నాకు చాలా ఇష్టం.
కమల్, శ్రీదేవి కలసి నటించిన యే పాటైనా, ప్రేక్షకులకో ఐ ఫీస్టే వేణూజీ..అందులోనూ ఆ బాణీలు ఇళైరాజా ఆర్ యం.యస్.విశ్వనాధ్ గారి మ్యూజిక్ తో అల్లుకున్నవైతే..చూస్తూనే గుండె రిఫ్రెష్ ఐపోదూ..
కరెక్ట్ గా చెప్పారు శాంతి గారూ.. థాంక్యూ.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.