ఆదివారం, డిసెంబర్ 08, 2013

పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే..

రాజా సంగీతంలో మాములు దర్శకులు ఎన్నుకునే పాటలే చాలా రోజులు గుర్తుండిపోయేలా ఉంటాయి ఇక అవతల ఉన్నది బారతీరాజా గారి లాంటి వ్యక్తి అయితే ఇక చెప్పేదేముంది... వినడానికి ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట చిత్రీకరణ కూడా అంతే అందంగా సింపుల్ గా ఉంటుంది. సినారే గారి సాహిత్యంలో తెలుగుదనం ఉట్టిపడితే... బాలు గారు జానకి గారు ఒక డ్యూటీలా కాక పాటలో లీనమై సరాగాలాడుకుంటూ పాడిన ఈ అందమైన పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం: కొత్త జీవితాలు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సినారె
గానం: బాలు, జానకి

పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే...

కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే...
వన్నెకాడు నన్ను కలిసే...

పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పవనాలే జిల్లనగా...హృదయాలే ఝల్లనగా
పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే
కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే....

కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా
కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా
మ్రోగిందీ.. రాగం..మ్రోగిందీ.. రాగం..
ఆడిందీ తాళం...అది నీ కోసం...హా.హా.హా

కన్నెమదిలో అందాలెన్నో..పొంగి పొరలే..
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే...
వన్నెకాడు నన్ను కలిసే

పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా
పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా
కన్నుల్లో... మౌనం ...కన్నుల్లో... మౌనం...
నవ్వుల్లో గానం..అది నా కోసం...హా.హా.హా..

పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే
కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే...

9 comments:

చాలా చక్కని పాట. నాకు చాలా ఇష్టమైన పాట పరిచయం చేసారు . ధన్యవాదములు వేణు గారు .

ధన్యవాదాలు అజ్ఞాత గారు, వనజ గారు.

మై గాడ్..వేణూజీ..మనసు పొరల్లో దోబూచులాడుతున్న మౌన రాగాలని తట్టి లేపిందండీ మీ పాట..

బాలు జానకీ ఇద్దర్నీ పూర్తిగా వినియోగించి వాళ్లలోని పాషన్ ని బయట పెట్టి పాడాలనే వాళ్ల దాహాన్ని తీర్చింది ఇళయ రాజాయేనేమో! ఈ పాటలో "కు కు కూ" సీక్వెన్స్ అద్భుతం. ఎంత బాగా పాడతారో!

ఒకరిని ఒకరు ఓవర్ లాప్ చేస్తూ.....

అలాగే "కన్నుల్లో మౌనం...." అన్న చోటా...

ఆ తర్వాత చరణం చివర్లో.. ఆలాపన... అసలు అన్నేసి ప్రయోగాలు ఇళయ రాజాకే సొంతం! అతని ప్రయోగాల్ని అంతే అందంగా పాడిన బాలు జానకి ఇద్దరూ ఇళయ రాజా వరకూ భలే కాంబినేషన్

థాంక్స్ సుజాత గారు, అదేంటండీ ఇళయరాజా వరకు మాత్రమేనా వాళ్ళిద్దరు కలిసి పాడినపాటలన్నీ ఇలాగే పోటాపోటీగా పాడతారు కదండీ.

చాలా మంచి పాట....చాలా హాయిగా ఉంటుంది

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.