ఆదివారం, డిసెంబర్ 22, 2013

ఆలారే ఆలారే

సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా తేనెమనసులు అనగానే ఎక్కువమంది 1965 లో విడుదలైన సినిమానే గుర్తు తెచ్చుకుంటారు కానీ అదే పేరుతో 1987 లో జయప్రద, సుహాసిని లతో కూడా ఒక సినిమా చేశారు అందులోదే ఈ “ఆలారే ఆలారే” పాట. సుహాసినిది సెకండ్ హీరోయిన్ గా ఆరాధన ప్లస్ త్యాగం కలిసిన డీసెంట్ రోల్ అయితే జయప్రద మెయిన్ హీరోయిన్ గా చేసింది. 

ఇందులోదే “మమ్మీ మమ్మీ” అనేపాట కూడా అప్పట్లో టీ బంకుల్లోనూ అక్కడా ఇక్కడ తరచుగా వినపడే పాట ఆసక్తి ఉంటే ఇక్కడ చూసీ విని ఎంజాయ్ చేయండి.  ఈ పాటలో స్టెప్స్ సూపర్ అసలు :-) ఇక మన పాట బప్పీలహరి పంథాలో కొంచెం బీట్స్ ఎక్కువగా వినిపించినా వేటూరి గారి సాహిత్యం, సుహాసిని అభినయం సుశీల గారి గానం తోడవడంతో చక్కని పాటగా తయారైంది. నేను తరచుగా వినేపాటలలో ఇదీ ఒకటి. మీరూ చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.

 

చిత్రం : తేనెమనసులు 1987
సాహిత్యం : వేటూరి
సంగీతం : బప్పీలహరి
గానం : పి. సుశీల

ఓఓఓ... ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా..

ఓఓఓ..ఓ.ఓ పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో..
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా..
పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో..
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా..
వేణూ గానాలెన్నో ఈ రాధా గుండెల్లో..
మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో..
పాడనా.. ఊపిరై.. రాధాలోలా..

ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..

ఓఓఓ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం..
కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం..
ప్రేమే నా... ప్రాణమూ..
ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం..
కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం..
ప్రేమే నా... ప్రాణమూ..
ప్రేమే ఆతిధ్యమ్.. నీకూ ప్రేమే ఆహ్వానం..
ప్రేమే నా జీవం.. కృష్ణ ప్రేమే నాదైవం..
స్నేహమే....ఏ.. ప్రాణమూ.. రాధాలోలా..

ఆలారే ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..
ఆలారే ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..

2 comments:

ఇట్స్ ఏ ఓకే సాంగ్..ఆల్ రెడీ పెళ్ళైన బాస్ ని మౌనంగా ఆరాధించే సుహాసిని(ఐ మీన్ చాలా నిర్మల భక్తే అనుకోవాలని డైరెక్టర్ వుద్దేశమండీ) అతను భోజనానికి తమ ఇంటికి వస్తున్నాడని ఆనందం తో పాడే పాట ఇది..ఆతని కోసం స్వయం గా పాలు పితికి మరీ కాఫి చేసి, మా ఫ్రెండ్స్ అందరం ఈ పాట చూస్తున్నప్పుడు భలే నవ్వుకున్నామండీ..చాలా ధాంక్స్.మంచి ఙాపకం గుర్తు చేసినందుకు..

మీ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.