శనివారం, డిసెంబర్ 21, 2013

ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో

మధురమైన పాటలలో సైతం సంధర్బానుసారంగా చిత్రీకరణతో కామెడీ పండించిన ఘనత ఈసినిమాలో సింగీతంగారికీ ఆ తర్వాత "వేవేల గోపెమ్మలా" పాటలో విశ్వనాధ్ గారికీ మాత్రమే దక్కుతుందేమో, చిత్రమేమంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరో కమల్ గారే కావడం. "సొమ్మొకడిదీ సోకొకడిది" సినిమాలోని ఈ పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో చిత్రీకరణ కూడా అంతే సరదాగా ఉంటుంది. ఆ చక్కని పాటని చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినండి. 

 

చిత్రం :    సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం :    రాజన్-నాగేంద్ర
సాహిత్యం :    వేటూరి
గానం :    బాలు, సుశీల

ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా


రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు
అది తీపి కోపాల వయసూ..
ఆ ఆ ఆ....
కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు
అది మాయ మర్మాల మనసూ

అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
పదహారువేల సవతులు వద్దు
ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు


ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా.. ఆఁ.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో గోపెమ్మ నీడలో వెన్నా.. అహ.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా

ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా..
ఆ..ఆ..ఆ..
ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా..
వేసవి చూపు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు
వేసవి చూపు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు
కలహాలు పెంచే కౌగిలి ముద్దు
ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా


ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న
ఆహాహహాహ లాల్లలలలాల్ల
ఆహాహహాహ లాల్లలలలాల్ల

2 comments:

యెందుకో ఈ పాట యెప్పుడు విన్నా, మధురా నగరిలో చల్లలమ్మ బోదు పాట గుర్తొస్తుంది నాకు..మనసు తెలీని వుద్వేగానికి గురౌతుంది..థాంక్యూ వేణూజీ..

థాంక్స్ శాంతిగారు, మరో మంచిపాట గుర్తుచేశారు థాంక్సండీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.