బుధవారం, డిసెంబర్ 25, 2013

మల్లెల వేళ అల్లరి వేళ

చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన ఒక మంచి మెలోడీ ఈ మల్లెలవేళ అల్లరివేళ పాట. సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ అప్పట్లో ఈపాటకూడా రేడియోలోనే విన్న గుర్తు. పల్లవి పాడే ముందు ఊహుహు అంటూ మొదలుపెట్టడం భలే ఉంటుంది. ఈ పాటమీరూ చూసి విని ఆనందించండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: జి. ఆనంద్, సుశీల

మల్లెల వేళ.. అల్లరి వేళ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా


ఉహూహు ఊఊ.. 
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
ఉహూహు..ఊ.ఉ..

 
ఒక యమున నేడు పొంగింది
ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ జుమ్మంది
ఒక రాధ మనసు ఝల్లంది
 
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ

ఉహూహు..ఊ.ఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల

 
ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది

నింగీ నేల మురిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల జీవించు వేళ

ఉహూహు..ఊఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

ఉహూహు..ఊఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల


4 comments:

Venuji..manchi manchi old songs post chestunnaru..chalaa chaalaa thanq:-):-)
inkaa "swarna kamalam" movielo "ghallu ghallu gaallumantu...","kothagaa..."songs chaalaa chaalaa baguntaayi kadaa..vaatini kudaa maa kosam post cheyandi..:-):-):-)

Thanks Karthik gaaru. తప్పకుండా మీరడిగిన పాటలు కూడా పోస్ట్ చేస్తాను.

చాలా మంచి మెలోడి..ఇది నాకూ, మా వారికీ కూడా చాలా ఇష్టమైన పాట..ధాంక్యూ వేణూజీ..

థాంక్స్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.