శుక్రవారం, డిసెంబర్ 27, 2013

మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ..

శివరంజని సినిమాలోని పాటలు ఎంత ఫేమస్సో చెప్పక్కర్లేదు కదా అందులో బోలెడు పాటలు సూపర్ హిట్ వాటి మరుగున కాస్త తక్కువ పేరు తెచ్చుకున్న పాట ఈ "మాపల్లె వాడలకు" పాట. ఇది రాసినది ఎవరో నాకు తెలియదు రమేష్ నాయుడి గారి సంగీతం మాత్రం అలా గుర్తుండిపోతుంది. ఈ పాట చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రం వినాలంటే చిమటాలో ఇక్కడ వినవచ్చు. 

చిత్రం : శివరంజని(1978)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : 
గానం : బాలు, సుశీల
మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ
నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ
మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ
నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ


కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ
కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ
వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ
వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ
మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ
ఆ..ఆ..మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ

యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తీ
వెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తీ
యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తీ
వెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తీ


మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ
నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ


సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా
సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా
కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా
కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా
సరసమైన ధర చెప్పు ఓ మందయానా
ఆ..ఆ.. సరసమైన ధర చెప్పు ఓ మందయానా

తల్లి చాటు పిల్లనయ్యా కృష్ణమూర్తీ
మా నాయనమ్మ నడగాలయ్యా కృష్ణమూర్తీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇదే జానపదాన్ని పైపాటలో రమేష్ నాయుడు గారు డ్యూయెట్ గా మారిస్తే, జానపదాన్ని అలాగే ఉంచి పెద్దగా మార్చకుండా కె.వి.మహదేవన్ గారు సూత్రధారులు సినిమాలో ఉపయోగించారు. ఈ పాటకూడా నాకు చాలా ఇష్టం. వీడియో ఇక్కడ చూడవచ్చు, ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.

చిత్రం : సూత్రధారులు(1989)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : 
గానం : బాలు, కోరస్

జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

పాలకోసమొచ్చినాను గోపికాంబ
పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ

యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై

దింతక్కు తాదిమి దింతక్కు తాదిమి
దింతక్కు తకదిమి దింతక్కు తకదిమి
దింతాక్కు దింతాక్కు దింతకు త దింత
కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి

కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ

2 comments:

మీరు సూత్రధారులకి పోస్ట్ చేసిన రాధా కృష్ణుల పిక్..టూ గుడ్ వేణూజీ..చిన్న బొమ్మ లో ఈ పాట అర్ధం అంతా యెంతో అందం గా ఇమిడిపోయింది..

థాంక్స్ శాంతి గారూ.. కరెక్ట్ అండీ నాకూ చాలా ఆప్ట్ గా అనిపించింది ఆ బొమ్మ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.