శనివారం, ఫిబ్రవరి 14, 2015

ప్రేమికులరోజు శుభాకాంక్షలు...

ప్రేమికులందరికీ ప్రేమికులరోజు శుభాకాంక్షలు. ఈ స్పెషల్ డే సందర్బంగా దూకుడు చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ప్రేయసి తొలిసారిగా కనిపించిన క్షణాలను అపురూపంగా గుర్తుంచుకుని ఆ క్షణం నుండీ తన జీవితం ఎంత మారిపొయిందో దానిపై ఆ అమ్మాయి ప్రభావం ఎంత ఉందో ఎంతా బాగా చెప్తున్నాడో ఈ ప్రేమికుడు మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దూకుడు (2011)
సంగీతం : ఎస్. ఎస్. తమన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రాహుల్ నంబియార్

గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40..
తొలిసారిగా చూసానే నిన్నూ..ఊ..
చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి..
నిదరే పోనందే నా కన్నూ..ఊ..
 
గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40..
తొలిసారిగా చూసానే నిన్నూ..ఊ..
 
రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే..
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేసావే..ఓయే.. 

ఓం శాంతి శాంతి అనిపించావే
 
జర జర సున్ తో జర జానే జానా..
దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన..
సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా.. హసీనా..

 
నువ్ వాడే పెర్ఫ్యూమ్.. గుర్తొస్తే చాలే..
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం.. నీతో నిండిందే..
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమెట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో..
అన్నట్టుందే.. క్రేజీగా ఉందే
నింగీ నేల తలకిందై కనిపించే
జాదూ ఏదో చేసేశావే..ఓయే.. 

ఓం శాంతి శాంతి అనిపించావే
 
జర జర సున్ తో జర జానే జానా..
దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన..
సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా.. హసీనా..

 
గడియారం ముళ్ళై తిరిగేస్తున్నానే..
ఏ నిమిషం నువ్వు 
ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే..
నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడుంటూ
డైలీ రొటీన్ టోటల్ గా నీ వల్లే చేంజ్ అయ్యింది..
చూస్తూ చూస్తూ.. నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంటు కుర్రాణ్ణి
అవారా లా మార్చేసావే..ఓయే.. 

ఓం శాంతి శాంతి అనిపించావే
 
జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా..
చెలియలా చేరిపోనా నీలోనా
ఏదేమైనా నీకు నేను సొంతం కానా..
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం.. నా సర్వం.. నీకోసం..~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


అందమైన అనుభవం చిత్రం కొసం ఎమ్మెస్ విశ్వనాథ్ గారి స్వరకల్పనలో బాలు జానకి గారు గానం చేసిన ఈ పాట చూడండి. బాలచందర్ గారు సింగపూర్ అందాలను ప్రేమికుల మధ్య అందమైన క్షణాలను చూపిస్తూ చాలా బాగా చిత్రీకరించారీ పాట. ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్ని మాటలు మాత్రం సరిపోతాయ్ అనుకున్నారో ఏమో అందమైన అనుభవం, యాన్ ఎఫైర్ టు రిమెంబర్ అన్నమాటలతోనే స్వరాలొలికించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


1 comments:

అందామైన అనుభవం నిజం గా ఓ అందమైన అనుభవమే..ఆ అనుభూతి నించి బైటికి రావాలనే అనిపించదు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.