గురువారం, ఫిబ్రవరి 05, 2015

చిన్నారి పొన్నారి పువ్వు...

ఎన్టీ ఆర్ సావిత్రి గార్ల పాటలు చూడడమంటే నాకెంత ఇష్టమో... వారికి ఘంటసాల సుశీల గార్లు స్వరమిస్తే ఆ అందం మరింత రెట్టింపవుతుంది. ఇది వారి కాంబినేషన్ లో వచ్చిన మరో అందమైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నాదీ ఆడజన్మే (1965)
సంగీతం : ఆర్. సుదర్శన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
ఆహ హా..ఊహు హూ..
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ
హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ
 
పసివాడు పలికేటి మాటా
ముత్యాల రతనాల మూటా

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
ఆహ హా..ఊహు హూ..
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా
ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా
 
కనుమూసి నిదురించు బాబూ
కలలందు జోగాడగలడు

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ 
నిను చూసి నను చూసి నవ్వూ 

ఆహాహ ఆహాహ ఆహా...
ఆహాహ ఆహాహ ఆహా..
 

1 comments:

లేత గులాబీ మొగ్గవంటి పసి వారి బాల్యాన్ని ఇప్పుడు ప్రతి నిమిషం కెమేరా లో బంధించేది ఫేస్బుక్, వాట్సప్ కోసం మాత్రమే అనుకుంటే బాధగా ఉంటుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.