శుక్రవారం, ఫిబ్రవరి 06, 2015

ఏమని నే చెలి పాడెదనో...

ఈ పాటకు ఇళయరాజా గారిచ్చిన మెస్మరైజింగ్ ట్యూన్ అంటే నాకు చాలా ఇష్టం. పాటకు ముందు మొదలై పాటతో పాటూ అక్కడక్కడ "హా.." అంటూ సాగే కోరస్ చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఏమని నే..  చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో
తోటలలో .. పొదమాటులలో.. 
తెరచాటులలో...
ఏమని నే మరి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

 
నవ్వు.. చిరునవ్వు.. విరబూసే పొన్నలా
ఆడు.. నడయాడు.. పొన్నల్లో నెమలిలా
పరువాలే పార్కుల్లో.. ప్రణయాలే పాటల్లో
 నీ చూపులే నిట్టూర్పులై.. నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై.. నీ ఊపిరే నా ఆయువై..
సాగే తీగ సాగే రేగిపోయే లేత ఆశల కౌగిట..

 

ఏమని నే.. మరి పాడుదునో.. 
తికమకలో ఈ మకతికలో
 

చిలక.. గోరింక.. కలబోసే కోరిక
పలికే.. వలపంతా.. మనదేలే ప్రేమికా
దడ పుట్టే పాటల్లో.. ఈ దాగుడుమూతల్లో
ఏ గోపికో దొరికిందనీ.. ఈ రాధికే మరుపాయెనా
నవ్విందిలే బృందావని.. నా తోడుగా ఉన్నావని..

 ఊగే తనువులూగే.. వణకసాగె రాసలీలలు ఆడగ

ఏమని నే..  మరి పాడుదునో ..
తొలకరిలో తొలి అల్లరిలో మన అల్లికలో..

 ఏమని నే.. చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో


3 comments:

Nice song. It's one of my favorite Ilayaraja's compositions.

In "ఏ గోపికో దొరికిందని.. ఈ రాజుకే మరుపాయెనా" line, it is "ఏ గోపికో దొరికిందని.. ఈ రాధికే మరుపాయెనా" and that line is a female portion.

$id

థాంక్స్ సిద్ గారు.. వీడియోలో ఈ లైన్ మిస్ అవడం వల్ల కన్ఫూజ్ అయ్యానండీ ఇపుడు కరెక్ట్ చేశాను..

ఈ పాట యెప్పుడు విన్నా మనసుని మెస్మరైజ్ చేస్తుంది యెందుకో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.