ఏ.ఆర్.రెహ్మాన్ స్వర సారధ్యంలో ఉన్నిమీనన్ గానం చేసిన ఈ పాట ప్రేమలో పడ్డాక ఒక ప్రేమికుడి అవస్థను కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది... ఆ ప్రేమ అతనిని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో.. తన ప్రియురాలు తనకెంత అందంగా అపురూపంగా కనపడుతుందో వర్ణిస్తూ సాగే ఈ పాట నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రెమికులరోజు (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం : ఉన్నిమీనన్
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
1 comments:
ఈ మూవీకి హీరో మైనస్ అనిపించేది యెప్పుడూ..బట్ రియల్ గా లైఫ్ నించే మైనస్ అయిపోయాడని తెలిసినప్పుడు బాధ కలిగింది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.