సిరిసిరిమువ్వలోని ఒక కమ్మనైన గీతం ఈరోజు తలచుకుందాం. మహదేవన్ గారి స్వరంలోనా, వేటూరి గారి పదాల్లోనా, బాలూ సుశీల ల స్వరాల్లోనా, విశ్వనాథ్ గారి చిత్రికరణలోనా ఈ పాటలోని కమ్మదనం ఎందులో ఎక్కువ ఉందో మీరేమైనా తేల్చుకోగలిగితే కాస్త నాక్కూడా చెప్పండి ప్లీజ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది
అది మనవూరి కోకిలమ్మా
నిన్నడిగింది కుశలమమ్మా
అది మనవూరి కోకిలమ్మా
నిన్నడిగింది కుశలమమ్మా
నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు
అది పదిమంది కామాట తెలుపు
నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు
అది పదిమంది కామాట తెలుపు
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
ఎల్లువ గోదారల్లే వెన్నెట్లో గోదారల్లె
ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
వల్లంకి పిట్టా పల్లకిలోనా
సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లె
1 comments:
వారందరూ మహామహులేనండీ..బట్ నిస్సందేహంగా జయప్రద చూపుల్లోనే సుమా..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.