మంగళవారం, ఫిబ్రవరి 03, 2015

ప్రేయసి మనోహరి...

వారసత్వమ్ చిత్రంలోని ఒక అందమైన పాట ఇది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వారసత్వం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి..
తియ్యని మనోరధం నా తియ్యని మనోరధం
ఫలింప చేయవే...
ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి...

దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
తారక సుధాకరా... తపించసాగెనే

హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర...

మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే

హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర...

ఆ హాహాహ..... హాహాహ
ఆ హాహాహ.... హాహాహ

పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
ఊహలో ఒయ్యారమో.. నా ఊహలో ఒయ్యారమో
ఉయ్యాలలూగెనే...

ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి....

1 comments:

ఇలా అడిగితే దరి చేరని ప్రేయసి ఉంటుందా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.