బుధవారం, ఫిబ్రవరి 25, 2015

ఇంటింటి రామాయణం...

ఇంటింటి రామాయణం చిత్రం కోసం రాజన్ నాగేంద్ర గారు స్వరపరచిన ఒక సరదా అయిన పాట ఈరోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

 
చిత్రం : ఇంటింటి రామాయణం (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
 
సీతమ్మ చిలకమ్మ.. రామయ్య గోరింక
వలపుల తలపులె సరాగం
 
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం.. అహహ
 
నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే

నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాల పాటలు.. ముత్యాల మూటలు

అల్లల్లే ఎహే ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

చిలకమ్మ గోరింక అ సిరిమల్లే అ పొదరింట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

 
సరిగంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా
సరిగంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి.. తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
  
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్

ఇల్లేకద స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకద స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి

అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి
 
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ ... చిలకమ్మ రామయ్య... గోరింక
వలపుల తలపుల సరాగం

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
 
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
 
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము


1 comments:

ఆ టైం లో వచ్చిన చంద్రమోహన్ గారి మూవీస్ అన్నీ ఫేమిలీ ఓరియెంటెడ్ గా సరదాగా ఉండేవి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.