నిన్న ప్రేమికులరోజు బాగా సెలెబ్రేట్ చేస్కున్న వారంతా ఈ రోజు కూడా ఈ అమ్మాయిలా "ఐ యామ్ ఇన్ లవ్ బేబీ ఐ యామ్ ఇన్ లవ్" అని పాడుకుంటూ హాపీగా ఎంజాయ్ చేసేయండి. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ కొత్తపాట నా ప్లేలిస్ట్ లో వెంటనే చోటు సంపాదించేసుకుంది. తన మెలోడియస్ ట్యూన్ కు చిన్మయి స్వరం కూడా ఎంత బాగా సూటయిందో... రామజోగయ్య శాస్త్రిగారు బాగా రాశారీ పాటను. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రన్ రాజా రన్ (2014)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : చిన్మయి
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
నాలోనే ఉన్నా తెలియలేదు ఏ సడి లేని అలజడి
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది
నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈ రోజిలా
చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా
గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా
నిన్నల్లో నేనే నేనా నిన్నిల్లా ప్రేమిస్తున్నా
నీ మాయ దయ వలనా..
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయ్యింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టూ లోకం నీలా కనిపిస్తోంది
నీ జంట నడిచే అడుగు చూడు
గాల్లోన తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్ది
నీలో నిను కలిసే కొద్ది
నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తోంది
నీ నీడలోనే నాకు ఆనందముంది
నూరేళ్ళకూ నేను నీలోన బంధీ
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక
నీలోన సగమవనా....
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
నాలోనే ఉన్నా తెలియలేదు ఏ సడి లేని అలజడి
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది
నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈ రోజిలా
చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా
గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా
నిన్నల్లో నేనే నేనా నిన్నిల్లా ప్రేమిస్తున్నా
నీ మాయ దయ వలనా..
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయ్యింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టూ లోకం నీలా కనిపిస్తోంది
నీ జంట నడిచే అడుగు చూడు
గాల్లోన తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్ది
నీలో నిను కలిసే కొద్ది
నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తోంది
నీ నీడలోనే నాకు ఆనందముంది
నూరేళ్ళకూ నేను నీలోన బంధీ
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక
నీలోన సగమవనా....
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
1 comments:
ఈ మూవీ లోదే అనగా అనగనగా..పాట బావుంది..ఆల్రెడీ వేసేసినట్టున్నారుగా వేణూజీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.