శుక్రవారం, ఫిబ్రవరి 13, 2015

నీలో వలపుల సుగంధం...

బాలచందర్ గారు, ఎమ్మెస్ విశ్వనాథన్ గారు, ఆత్రేయగారు కలిసి సృష్టించిన ఈ ప్రేమగీతం వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కనులకు వెలుగైనా కలలకు విలువైనా నువ్వేనని ఆమె అంటే మల్లెల జల్లులూ వెన్నెల నవ్వులూ ఎందుకు మదిలో నువ్వుంటే చాలని అతనంటున్నాడు. మాకిక లోకంతో పనిలేదంటూ ఒకరికొకరుగా ఈ ఇద్దరూ ఎంత హాయిగా పాడుకుంటున్నారో మీరే వినండి. ఈ పాట వీడియో దొరకలేదు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా

 
నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా...గతులుగా
లయలుగా....హొయలుగా

కనులకు వెలుగైనా.. కలలకు విలువైనా
నీవే నా చూపుగా....ఆ....ఆ
కనులకు వెలుగైనా.. కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ...ఆ
తలపులనైనా మరపులనైనా
నీవే నా రూపుగా
తలపులనైనా మరపులనైనా
నీవే నా రూపుగా
వయసుకే.... మనసుగా
మనసుకే...... సొగసుగా

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా

 
మల్లెలజల్లేలా.. వెన్నెల నవ్వేలా
మదిలో నీవుండగా...ఆ ఆ ఆ ...
మల్లెలజల్లేలా.. వెన్నెల నవ్వెలా
మదిలో నీవుండగా...
కోవెల ఏలా... దైవము ఏలా
ఎదటే నీవుండగా...ఆ....ఆ...
కోవెల ఏలా... దైవము ఏలా
ఎదటే నీవుండగా
నేనుగా... నేనుగా
వేరుగా... లేముగా

నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా...గతులుగా
లయలుగా....హొయలుగా

నీలో వలపుల సుగంధం
నాలో చిలికెను మరంధం
తీయ్యగా....హాయిగా
మెత్తగా...మత్తుగా

2 comments:


బాలచందర్ గారు-యెమ్మెస్ విశ్వనాధన్ గార్ల కాంబినేషన్ గురించి చెప్పేదేముంది..మైమరచిపోవడం తప్ప..విశ్వనాధన్ గారి ఆరోగ్యం బాలేదని తెలిసింది..వారికి ఆయురారోగ్యాలు చేకూరాలని మా కోరిక..ప్రార్ధన..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.